ఇంట్లో పెత్తనం మొత్తం ఆమెదే.. భార్యపై పోసాని కామెంట్స్!

Published : May 04, 2019, 04:06 PM IST
ఇంట్లో పెత్తనం మొత్తం ఆమెదే.. భార్యపై పోసాని కామెంట్స్!

సారాంశం

ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. 

ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తన పెళ్లి అలానే భార్యపై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి కారణంగా భార్యభర్తలుగా తాము ఏం కోల్పోయామో చెప్పే ప్రయత్నం చేశారు.

తన భార్య కుసుమలతబీఎస్సీ బిఎల్, ఎంఎల్ నాగ్ పూర్ యూనివర్సిటీలో చేసిందని, ఆమె ఎంఎల్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాస్తుండగా తమ పెళ్లి జరిగిందని అన్నారు. పోసాని ఎంఏ, ఎంఫిల్ చేసినట్లు చెప్పారు. మరో మూడు నెలల్లో పీహెచ్డీ పూర్తవుతుందనుకున్న సమయంలో పెద్దలు పెళ్లి చేసేసినట్లు చెప్పారు.

కొన్ని రోజులు ఆగి ఉంటే తనకు డాక్టరేట్ రావడంతో పాటు, తన భార్యఎంఎల్ కూడా పూర్తయ్యేదని కానీ పెద్దల కాదనలేక పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. పెళ్లయితే అంతే.. వివాహం విద్య నాశనం, శోభనం సర్వనాశనం అంటూ తనదైన స్టైల్ లో కామెంట్ చేశారు. అయితే దానికి మించిన ఆప్యాయత, అఫెక్షన్, ప్రేమ అన్నీ తమ మధ్య ఏర్పడ్డాయని, భార్యాభర్తలుగా కాకుండా స్నేహితుల్లా ట్రావెల్ అవుతూ వచ్చామని చెప్పారు.

ఇంట్లో కూడా ఇద్దరం ఒకరినొకరం డామినేట్ చేసుకోమని, ఇంటి పెత్తనం అంతా కూడా తన భార్యదే అంటూ చెప్పుకొచ్చాడు. డబ్బులకు సంబంధించిన విషయాలైనా, మరే విషయమైనా ఆమెకి తెలియజేస్తాను అంటూ భార్య పట్ల తనకున్న గౌరవాన్ని బయటపెట్టారు. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి