
నటి శ్రీదేవి మరణించి ఏడాది కాలం దాటిపోయింది.. కానీ ఆమె అభిమానులు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అభిమానుల పరిస్థితే అలా ఉంటే ఇక ఆమె భర్త, పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇప్పటికీ కూడా వారు ఆ షాక్ నుండి బయటపడలేకపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ టీవీ షోకి హాజరైన బోనీకపూర్ తన భార్యని తలచుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. 'ఔర్ ఏక్ కహానీ' కారక్రమానికి హాజరైన బోనీని హోస్ట్ 'మీ జీవితంలో శ్రీదేవిని మర్చిపోయిన క్షణం ఏదైనా ఉందా..?' అని ప్రశ్నించాడు.
అది వినగానే ఎమోషనల్ అయిన బోనీ కన్నీటిని ఆపుకుంటూ.. 'లేదు.. ఆమెని మర్చిపోవడం అసాధ్యం' అంటూ సమాధానమిచ్చారు. తప్పుడు ఆర్ధిక నిర్ణయాల గురించి ప్రశ్నించగా.. 'నేను రేస్ లకు వెళ్లి, జూదం ఆడి డబ్బులు పోగొట్టలేదు. ఈ విషయం చాలా మందికి అర్ధం కాదు.. ఆర్ధికపరంగా కొన్ని తప్పు జరిగాయని నాకు తెలుసు. అయితే అలాంటి సందర్భాల్లో ఫ్యామిలీ సపోర్ట్, ముఖ్యంగా పిల్లల సపోర్ట్ లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదృష్టం కొద్ది ఈ విషయంలో నా ఫ్యామిలీ నాకు పూర్తి సపోర్ట్ అందించింది' అంటూ చెప్పుకొచ్చారు.