విషాదంః ప్రముఖ స్టాండప్‌ కమేడియన్‌, నటుడు కన్నుమూత..

Published : Apr 13, 2022, 04:55 PM IST
విషాదంః ప్రముఖ స్టాండప్‌ కమేడియన్‌, నటుడు కన్నుమూత..

సారాంశం

ప్రముఖ హాలీవుడ్‌ స్టాండప్‌ కమేడియన్‌, నటుడు గిల్బర్ట్ గాట్‌ఫ్రైడ్‌(67) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 

ప్రముఖ అమెరికన్‌ స్టాండప్‌ కమేడియన్‌, నటుడు గిల్బర్ట్ గాట్‌ఫ్రైడ్‌(67) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. పాపులర్‌ ఎన్‌బీసీ సంస్థ లోని `సాటర్డే నైట్‌ లైవ్‌` సినిమాలో గిల్బర్ట్ నటించి మెప్పించారు. అంతేకాదు యానిమేటెడ్‌ డిస్నీ మూవీ `అలాద్దీన్‌`లో వ్యంగ్య చిలుక వాయిస్‌తో మెప్పించారు.

తన వాయిస్‌తో ప్రపంచ ప్రేక్షకులను నవ్విస్తూ అలరించిన గిల్బర్ట్ మరణం ప్రపంచ సినిమాకే తీరని లోటని హాలీవుడ్‌ మేకర్స్, సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. తీవ్ర దిగ్భ్రాంతిని తెలియజేస్తూ, సంతాపం తెలిపారు. గిల్బర్ట్ కి భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఆయన మరణ వార్తని తెలియజేస్తూ `గిల్బర్‌ అద్భుతమైన భర్త, ఇద్దరు కుమారులకు మంచి తండ్రి,స్నేహితుడు, సోదరుడు. ఆయన్ని చాలా మిస్‌ అవుతున్నాం` అని వెల్లడించింది. `ఇది చాలా విచారకరమైన రోజు. అయినప్పటికీ గిల్బర్ట్‌ మీరు ఎప్పుడూ అలాగే బిగ్గరగా నవ్వుతూ ఉండండి` అని తెలిపారు వారి కుటుంబ సభ్యులు.

అమెరికాలోని బ్రూక్లిన్‌లో 1955 ఫిబ్రవరి 28న జన్మించిన గిల్బర్ట్ న్యూయార్క్ లో స్టాండప్‌ కమెడీయన్‌గా రాణించారు. నాటకాలు వేశారు. ఆయన్ని ప్రారంభంలో ఎడ్జీ కామెడీగా వర్ణించేవారు. తనదైన కామెడీగా ఆడియెన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేయడం ఆయన కామెడీ స్టయిల్‌. 2001లో న్యూయార్క్, వాషింగ్టన్‌ డీసీ లో జరిగిన దాడుల్లో మూడు వేల మంది చనిపోయిన ఘటనపై గిల్బర్ట్ సెటైరికల్‌గా జోకులేసి వివాదాల్లో నిలిచారు. సునామీపై కూడా ఆయన వ్యాంగ్యాస్త్రాలు సందడించి విర్శలు ఎదుర్కొన్నారు.

గిల్బర్ట్ అనేక సినిమాల్లో, టెలివిజన్స్, షోస్‌ చేశారు. యానిమేషన్‌ పాత్రలకు వాయిస్‌ అందించారు. పలు షోలకుహోస్ట్ గానూ పనిచేశారు. 1970 నుంచి ఇప్పటి వరకు నటుడిగా యాక్టివ్‌గా ఉన్నారు. యాభై ఏళ్లుగా ఆడియెన్స్ ని అలరిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Sobhan Babu రిజెక్ట్ చేసిన సినిమాతో.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో ఎవరు? ఏంటా సినిమా?
Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్