Ranbir-Alia Bhatt : బ్యూటీఫుల్ గ్లింప్స్ తో రన్బీర్, అలియాకు అయాన్ ముఖర్జీ శుభాకాంక్షలు.. ఆ తేదినే వెడ్డింగ్!

Published : Apr 13, 2022, 03:16 PM IST
Ranbir-Alia Bhatt : బ్యూటీఫుల్ గ్లింప్స్ తో రన్బీర్, అలియాకు అయాన్ ముఖర్జీ శుభాకాంక్షలు.. ఆ తేదినే వెడ్డింగ్!

సారాంశం

బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) రన్బీర్ కపూర్, అలియా భట్ ల వివాహ వేడుక సందర్భంగా ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బ్యూటిఫుల్ గ్లింప్స్ ను షేర్ చేశారు. ఆ రొమాంటిక్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.    

బాలీవుడ్ స్టార్స్ రన్బీర్ కపూర్ (Ranbir Kapoor), అలియా భట్ (Alia Bhatt) ఇద్దరూ త్వరలో ఒక్కటవుతున్నట్టు వస్తున్న వార్తలను పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మస్త్ర’ (Brahmastra) దర్శకుడు అయాన్ ముఖర్జీ తాజాగా కన్ఫమ్ చేశారు. అయితే కొన్నాళ్ల నుంచి రన్ ఈ స్టార్ జంట ఒక్కటవుతున్నట్టుగా పుట్టలకొద్దీ వార్తలు వచ్చాయి. కానీ అటు అలియా ఫ్యామిలీ మెంబర్స్, ఇటు రన్బీర్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంత వరకు అధికారంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. దీంతో అంతటా కొంత సందిగ్ధమే ఉంది. తాజాగా దర్శకుడు అయాన్ ముఖర్జీ చేసిన పోస్ట్ రన్బీర్ - అలియా భట్ ఇద్దరూ ఒక్కటవుతున్నట్టుగా తెలియజేస్తోంది. ఈ మేరకు వారికి ముందస్తుగా వివాహ శుభాకాంక్షలు తెలుపుతూ బ్రహ్మస్త్ర నుంచి ఓ బ్యూటిఫుల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.  

రన్బీర్ కపూర్, అలియా భట్ ఇద్దరితో వారణాసిలో చిత్రీకరించిన ఉత్కంఠభరితమైన 'కేసరియా' పాట నుండి బ్యూటిఫుల్ గ్లింమ్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోను షేర్ చేస్తూ అయాన్ ఇలా రాశాడు.  ‘రన్బీర్ మరియు అలియా కోసం!  వారు త్వరలో పవిత్ర ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు ! రణబీర్ మరియు అలియా... ఈ ప్రపంచంలో నాకు అత్యంత సన్నిహితులు మరియు ప్రియమైన వ్యక్తులు. నాకోసం వారు తమను తాము పూర్తిగా, నిస్వార్థంగా మా సినిమాకి అందించారు.! మేము వారి కలయికలోని భాగాన్ని, మా సినిమా నుండి, మా పాట కేసరియా నుండి గ్లింమ్స్ ను వారికి బహుమతిగా పంచుకుంటున్నాం’ అంటూ తెలిపారు.  

అయితే ప్రత్యేకంగా వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు, సన్నివేశాలతో కూడిన వీడియోనే పంచుకోవడంతో వీరిద్దరి వెడ్డింగ్ మరోసారి కన్ఫమ్ అయ్యింది. అంతేకాకుండా ఏప్రిల్ 14, 15న ఈ స్టార్ జంట ఒక్కటవుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వల్ల అంది వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 20న వీరిద్దరి వివాహం ఒక కన్ఫమ్ అంటూ ప్రస్తుతం పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మరికొందరూ ఇప్పటికే రన్బీర్ - అలియా ఎంగేజ్ మెంట్ తాజాగా పూర్తైనట్టుగా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ జంట తమ పెండ్లిపై మౌనం వీడితేనే ఒక స్పష్టత వచ్చేట్టుగా ఉంది. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?