Pranitha Baby Bump : మొదటి సారి బేబీ బంప్ చూపించిన నటి ప్రణీత.. ప్రెగ్నెంట్ విమెన్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్.

Published : Apr 13, 2022, 01:15 PM IST
Pranitha Baby Bump : మొదటి సారి బేబీ బంప్ చూపించిన నటి ప్రణీత.. ప్రెగ్నెంట్ విమెన్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్.

సారాంశం

హీరోయిన్ ప్రణీత సుభాష్ (Pranitha) ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ విషయాన్ని తెలియజేసిన ఈ బ్యూటీ.. తాజాగా తొలిసారి తన బేబీ బంప్ ను చూపించింది. ఈ సందర్భంగా గర్భిణులపై ఆసక్తికరంగా కామెంట్ కూడా చేసింది.

గతేడాది మే30న వ్యాపార వేత్త నితిన్ ను ప్రేమించి పెండ్లి చేసుకుంది హీరోయిన్ ప్రణీత సుభాష్. కరోనా కారణంగా తన వివాహానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వకుండా ఈ జంట ఒక్కటైంది. ఆ తర్వాత అభిమానులకు వివరణ ఇస్తూ.. కరోనా నేపథ్యంలో డేట్ విషయంలో కన్ష్యూషన్ ఉండటంతో రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. కాగా, నితిన్, సుభాష్ బెంగళూరులో వివాహాం చేసుకుని ఇఫ్పటికీ ఏడాది పూర్తి కావస్తోంది. కానీ ఈ లోపే ప్రణీత తన అభిమానులకు శుభవార్త చెప్పింది. త్వరలో తను తల్లి కాబోతున్నట్టు రెండు రోజుల కింద తన భర్త పుట్టిన రోజు సందర్భంగా తెలిపిన విషయం తెలిసిందే. 

అయితే తాజాగా తన బెబీ బంప్ ను చూపించిందీ బ్యూటీ. ఈ మేరకు ఇన్ స్టాలో తన బేబీ బంప్ తో కూడిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలో ప్రణీత అద్దం ముందు నిల్చొని ఉంది. టీషర్ట్ నడుము పైకెత్తి.. తన పొట్టను తనిఖీ చేస్తోంది. ఈ విధంగా తొలిసారిగా తన బేబీ బంప్ ను చూపించి మురిసిపోతోందీ బ్యూటీ. అలాగే పోస్ట్ షేర్ చేస్తూ అదిరిపోయేలా క్యాప్షన్ ఇచ్చింది. గర్భిణులపై ఇంట్రెంగ్ గా రాసింది.‘మీరు ప్రెగ్రెంట్ అని తెలిసిన తర్వాత.. మీరు చేసే  మొదటి పని మీరు అద్దం దాటిన ప్రతిసారీ మీ పొట్టను తనిఖీ చేయడం’ అంటూ ఆసక్తి కరంగా కామెంట్ చేసింది. ఈ పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

ప్రెగ్నెంట్ కారణంగా నటి ప్రణీత ఇంట్లో ఫుల్ రెస్ట్ ప్రకటించినట్టు తెలుస్తోంది. ఇటీవల తన భర్తతో కూడిన ఫొటోలను షేర్ చూస్తే... ఇక ఎలాంటి పని భారం పెట్టుకోకుండా ఆరోగ్యంపై శ్రద్ధ చూపించేందుకు సిద్ధమైనట్టుగా అర్థమవుతోంది. మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కూడా ప్రస్తుతం ప్రెగ్నెన్సీ కారణంగా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటోంది. త్వరలోనే హెల్తీ బెబీకి జన్మనిచ్చేందుకు ఆరోగ్యం పట్ల శ్రద్ధవహిస్తోంది. 

పలు చిత్రాల్లో నటించి నటి ప్రణీత తెలుగు ఆడియెన్స్ కు ఎంతో దగ్గరైంది. ముఖ్యంగా తను ‘బావ’, అత్తారింటికి దారేది, హలో గురు ప్రేమకోసమే వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ‘రమణ అవతార’ అనే కన్నడ చిత్రంలో నటిస్తోంది. అయితే ప్రెగ్నెన్సీ కారణంగా ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటుందో లేదే చూడాలి. ప్రస్తుతం ఆ సినిమా చిత్రీకరణ కొనసాగుతోంది. తెలుగులో చివరిగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో నటించింది ప్రణీత. 

 

PREV
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు