విషాదం: ప్రముఖ టీవీ నటి ఉమా మహేశ్వరి కన్నుమూత..

Published : Oct 18, 2021, 08:01 AM IST
విషాదం: ప్రముఖ టీవీ నటి ఉమా మహేశ్వరి కన్నుమూత..

సారాంశం

ప్రముఖ తమిళ బుల్లితెర నటి ఉమా మహేశ్వరి(40) కన్నుమూశారు. ఆదివారం ఉదయం చెన్నైలో ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళ టీవీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. 

 కోలీవుడ్‌ విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ బుల్లితెర నటి ఉమా మహేశ్వరి(40) కన్నుమూశారు. ఆదివారం ఉదయం చెన్నైలో ఆమె తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళ టీవీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. `మొట్టి ఒళి` టీవీ సీరియల్‌ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఉమా మహేశ్వరి. `ఒరు కథైయిన్‌ కథై`, `మంజల్‌ మహిమై` వంటి సీరియల్స్ లో ప్రధాన పాత్రలు పోషించి టీవీ ఆడియెన్స్ కి, ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరైంది. 

సీరియల్స్ లోనే కాదు,సినిమాల్లోనూ నటించింది. `వెట్టిచాకిరి`, `కొడికట్టు`, `అల్లి అర్జున్‌` వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పింది. అటీ మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమా రంగంలోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. 

ఉమామహేశ్వరి భర్త మురుగన్‌. ఆయన పశువైద్యుడు. వివాహానంతరం ఉమా మహేశ్వరి నటనకు స్వస్తి చెప్పారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం తుది శ్వాస విడిచారు. ఉమా మహేశ్వరి మృతి పట్ల పలువురు సినీ, టీవీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు