`మా` ఎన్నికల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే ఎన్నికల తర్వాతనే అసలైన రచ్చ స్టార్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో మోహన్‌బాబుకి చిరంజీవి ఫోన్ చేశాడనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
`మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)కి సంబంధించిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికలకు ముందు కాదు, ఎన్నికల తర్వాతే అసలు రచ్చ స్టార్ట్ అయ్యింది. ఎన్నికల ఫలితాల రోజు మంచు విష్ణు.. చిరంజీవి ప్రస్తావన తేవడం మరింత వివాదంగా, చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల పోటీ నుంచి చిరంజీవిగారు తనని తప్పుకోమని మోహన్‌బాబుకి ఫోన్ చేసినట్టు విష్ణు తెలిపారు. అదే సమయంలో మోహన్‌బాబు సైతం పరోక్షంగా చిరంజీవిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దీంతో Maa వివాదం మరింతగా ముదురుతూ వస్తోంది. దీనికితోటు పోలింగ్ రోజు Mohanbabu తమపై దాడి చేశారని ప్రకాష్‌రాజ్ ఆరోపించారు. ఎన్నికల అధికారికి లేఖ రాస్తూ పోలింగ్ రోజు సీసీటీవీ ఫుటేజీ అందించాలని, అందులో వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు. అయితే ఈ ఫుటేజీని పోలీసులు సీజ్ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే తాజాగా మోహన్‌బాబుకి Chiranjeevi ఫోన్ చేశారనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో మరింత హాట్ టాపిక్‌గా మారింది.
undefined
మోహన్‌బాబుకి చిరు ఫోన్ చేసిన సంజాయిషీ చెప్పినట్టు తెలుస్తుంది. తాను ఎవరికీ మద్దతు ఇవ్వలేని మోహన్‌బాబుకి చిరు వెల్లడించారట. అకారణంగా తన పేరు బయటకు వచ్చిందని చెప్పారట. అనవసరంగా తనని ఇందులోకి లాగారని ఆయన ఆవేదన చెందినట్టు, తన తరఫున మోహన్‌బాబుకి సంజాయిషీ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనిపై మోహన్‌బాబు కూడా సానుకూలంగా స్పందించారని, అందరం కలిసికట్టుగానే ఉండాలనేది తన అభిమతమని చెప్పినట్టు సమాచారం.
also read:అలయ్ బలయ్ వేదికపై ఎడమొహం పెడమొహంగా మంచు విష్ణు పవన్... వైరల్ గా మంచు విష్ణు ట్వీట్!
ఇదిలా ఉంటే నిన్న(ఆదివారం) ఏర్పాటు చేసిన అలాయ్ బలాయ్ కార్యక్రమంలో `మా` అధ్యక్షుడు Manchu Vishnu, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇందులో మంచు విష్ణుతో మాట్లాడేందుకు అనాసక్తిని చూపించారు Pawan. విష్ణు నమస్కారం పెట్టినా పవన్ చూడకుండా ఆయన్నిదాటవేసే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మంచు విష్ణుకి, ప్రకాష్‌రాజ్ ప్యానెల్‌కి మధ్య జరిగిన Maa Election మంచు విష్ణు గెలుపొందారు. దీంతో ప్రకాష్ రాజ్ ప్యానెల్‌నుంచి గెలుపొందిన సభ్యులు రాజీనామా ప్రకటించిన విసయం తెలిసిందే. వాటిని లెక్కచేయకుండా తాజాగా మంచు విష్ణు `మా` అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం చేశారు.
also read:ఫ్యాన్స్ తో సమావేశంలో చిరంజీవి ఆవేదన.. ఆక్సిజన్ బ్యాంక్స్ కి కారణం ఆ ఊరిలో జరిగిన సంఘటనే