విషాదంః ప్రముఖ సంగీత దర్శకుడు వన్‌ రాజ్‌ భాటియా కన్నుమూత

By Aithagoni RajuFirst Published May 7, 2021, 3:24 PM IST
Highlights

ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు వన్‌రాజ్‌ భాటియా(93) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాదపడుతున్న ఆయన ముంబలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 

ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు వన్‌రాజ్‌ భాటియా(93) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాదపడుతున్న ఆయన ముంబలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ దిగ్ర్భాంతికి గురయ్యింది. ఇటీవల కరోనాతో వరుసగా సినీ ప్రముఖులు, యంగ్‌ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలోనే లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా నిలిచిన వన్‌రాజా భాటియా తుదిశ్వాస విడవడంతో విషాదం నెలకొంది. 

ఇక సంగీత దర్శకుడిగా భాటియా `మంతాన్`‌, `భూమిక`, `జానే బీదో యార్‌` వంటి అనేక విజయవంతమైన సినిమాలకు సంగీతం అందించారు. ఆ సినిమా విజయాల్లో భాగమయ్యారు. దీంతోపాటు టీవీ రంగంలో `టామస్`, `భరత్‌ ఏక్‌ ఖోజ్‌` వంటి పలు షోలకు సైతం మ్యూజిక్‌ అందించారు. శ్యామ్‌ బెనగల్‌ రూపొందించిన చిత్రాల్లో చాలా సినిమాలకు భాటియానే సంగీతం సమకూర్చారు. సంగీంతంలో ఆయన అందించిన సేవలకుగానూ భాటియా 2012లో పద్మ శ్రీ అవార్డును అందుకున్నారు. సుమారు 700కు పైగా జింగిల్స్‌(తక్కువ నిడివి ఉండే ట్యూన్స్‌) కంపోజ్‌ చేశారు. తన ప్రత్యేకతని చాటుకున్నారు.

చిత్రపరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఆయన పెళ్లి చేసుకోకుండా జీవితాంతం బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. ఎన్నో హిట్‌ సాంగ్స్‌ను అందించి గుర్తింపు పొందిన భాటియాను వృద్యాప్యంలో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. తనకు వైద్యం చేయించుకునేందుకు ఇంట్లోని వస్తువులను సైతం అమ్మేయాల్సి రావడం విషాదకరం. భాటియా మృతి పట్ల బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన సంగీతాన్ని గుర్తు చేసుకుంటూ నివాళ్లర్పిస్తున్నారు.

click me!