Ram Charan: ఆ కోరిక నాకూ ఉంది ఉపాసనా.. వెయిట్ చెయ్ తప్పదు.. పాపం చరణ్ నిస్సహాయత!

Published : May 06, 2022, 01:29 PM ISTUpdated : May 06, 2022, 01:32 PM IST
Ram Charan: ఆ కోరిక నాకూ ఉంది ఉపాసనా.. వెయిట్ చెయ్ తప్పదు.. పాపం చరణ్ నిస్సహాయత!

సారాంశం

రామ్ చరణ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే భార్య ఉపాసన మాత్రం ఓ కోరిక బయటపెట్టింది. కానీ చరణ్ తన నిస్సహాయత బయటపెట్టాడు. 

రోజుల వ్యవధిలో రెండు చిత్రాలు విడుదల చేశారు రామ్ చరణ్(Ram Charan). ఆయన నటించిన ఆర్ ఆర్ ఆర్, ఆచార్య మార్చి, ఏప్రిల్ నెలల్లో విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలు ప్రమోషన్స్ లో విరివిగా పాల్గొన్న చరణ్... వెంటనే శంకర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. చరణ్ 15వ చిత్రం ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. దాదాపు ఓ వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉండనుంది. వైజాగ్ షెడ్యూల్ ముగిసిన వెంటనే చరణ్ కొంత గ్యాప్ తీసుకోనున్నట్లు సమాచారం. అయితే చరణ్ వైజాగ్ షూట్ లో ఉండగానే భార్య ఉపాసన ఓ కోరిక బయటపెట్టారు. 

మండుటెండల్లో ఉపాసన(Upasana Konidela)కు ఎక్కడికైనా చల్లని ప్రదేశానికి చెక్కేయాలని ఉందట. ఇంస్టాగ్రామ్ లో తన మూడ్ ఉపాసన తెలియజేశారు. ఉపాసనను ఎంతగానో ప్రేమించే చరణ్ కోరికకు స్పందించారు. హాలిడేకి వెళ్లాలని నాకు కూడా ఉంది. కానీ ఏం చేయను కొన్ని రోజులు వేచి చూడక తప్పదు... అంటూ ఉపాసనను ట్యాగ్ చేశారు. ఆర్సి 15 మూవీ షూటింగ్ మధ్యలో ఉన్న నేను వెకేషన్ కి వెళ్లాలనే కోరిక ఉన్నప్పటికి ఎదురుచూడక తప్పదని ఆమెకు తెలియజేశారు . 

సోషల్ మీడియాలో రామ్ చరణ్, ఉపాసనలు పరస్పరం ఒకరిపై మరొకరు రొమాంటిక్ ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. తరచుగా చరణ్, ఉపాసన టూర్స్ కి వెళుతూ ఉంటారు. అప్పట్లో ఆఫ్రికా అడ్వెంచరస్ టూర్ కి వెళ్లారు ఈ జంట. అక్కడ క్రూరమైన మృగాల మధ్య సఫారీ చేశారు. పనిలో పనిగా ఆఫ్రికాలోని వైల్డ్ లైఫ్ ని తమ కెమెరాలో బంధించారు. వారి ఫొటోగ్రఫీ కి సంబంధించిన గ్యాలెరీ ఇంట్లో ఏర్పాటు చేసి, తమ ఫ్రెండ్స్ ముందు ప్రదర్శించారు. 

మరోవైపు ఆచార్య పరాజయం చరణ్ కి షాక్ ఇచ్చింది. ఆర్ ఆర్ ఆర్ విజయాన్ని ఆస్వాదించే లోపే ఆచార్య రూపంలో ప్లాప్ పడింది. దీనితో శంకర్ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇండియన్ సినిమాకు భారీతనం నేర్పిన దర్శకుడిగా పేరున్న శంకర్ నుండి వస్తున్న ఈ ఆర్సీ 15 (RC 15) పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. దిల్ రాజు నిర్మాతగా ఉన్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. రామ్ చరణ్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్
Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే