Virata Parvam: గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న 'విరాట పర్వం'.. ఇదిగో క్రేజీ అప్డేట్

Published : May 06, 2022, 11:26 AM ISTUpdated : May 06, 2022, 11:27 AM IST
Virata Parvam: గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న 'విరాట పర్వం'.. ఇదిగో క్రేజీ అప్డేట్

సారాంశం

వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'నీది నాది ఒకే కథ' చిత్రంతో వేణు ఊడుగుల విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. దీనితో విరాటపర్వం కథని చాలా బలంగా రాసుకున్నారు.

వేణు ఊడుగుల దర్శకత్వంలో 'విరాటపర్వం' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'నీది నాది ఒకే కథ' చిత్రంతో వేణు ఊడుగుల విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. దీనితో విరాటపర్వం కథని చాలా బలంగా రాసుకున్నారు. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నక్సలిజం బ్యాక్  డ్రాప్ లో రానా ఎంచుకున్న మరో ప్రయోగాత్మక చిత్రం ఇది. చాలా రోజుల క్రితం విడుదలైన టీజర్ అదరగొట్టింది. 

ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కోవిడ్ పరిస్థితుల కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్ర రిలీజ్ కు మోక్షం కలిగినట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు విరాట పర్వం రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. 

సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాలా రోజుల క్రితమే షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇక రిలీజ్ కు రెడీ అవుతుండగా ఏదో ఒక అడ్డంకులు ఈ చిత్రానికి ఎదురవుతూనే ఉన్నాయి. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతుండడంతో రానా ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఇటీవల రానా భీమ్లా నాయక్ చిత్రంతో హిట్ అందుకున్నాడు. కానీ సోలో హీరోగా.. నేనే రాజు నేనే మంత్రి తర్వాత హిట్ పడలేదు. ఆలోటు విరాట పర్వం చిత్రంతో తీరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

ఇక విరాట పర్వం చిత్రంలో నందిత దాస్, ప్రియమణి, నివేత పేతురేజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నక్సలైట్ గా రానా ఎలా నటించాడు అనే ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. సాలిడ్ రోల్ పడితే విశ్వరూపం ప్రదర్శించే రానా.. ఈ చిత్రంలో కూడా అదరగొట్టి ఉంటాడని భావిస్తున్నారు. విరాటపర్వం రిలీజ్ డేట్ ఎప్పుడనేది ఈ సాయంత్రం తేలనుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్
Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే