
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. పోకిరి, దూకుడు తర్వాత మహేష్ నటిస్తున్న కంప్లీట్ మాస్ మూవీ ఇదే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. మహేష్ బాబు ఫుల్ ఎనెర్జిటిక్ గా కామెడీ, మాస్ యాక్షన్ తో అదరగొడుతున్నారు.
ఈ చిత్రం నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ ఫ్యాన్స్ ని కుదురుగా ఉండనీయడం లేదు. సినిమా ప్రమోషన్స్ కోసం ట్విట్టర్ లో SVP హ్యాష్ ట్యాగ్ తో మహేష్ బాబు ఎమోజీని కూడా తీసుకువచ్చారు. శనివారం రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగనుంది. ఈ క్రమంలో సంగీత దర్శకుడు తమన్ ఇచ్చిన ఓ అప్డేట్ మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంది.
ఈ చిత్రంలో మహేష్ బాబు పేరుతో.. మ.. మ.. మహేషా అనే మాస్ సాంగ్ ఉంది. ఈ సాంగ్ ని శనివారం రిలీజ్ చేయబోతున్నట్లు తమన్ ప్రకటించారు. ఈ సాంగ్ పై తమన్ పెంచిన హైప్.. కీర్తి సురేష్ తో మహేష్ డాన్స్ చేస్తున్న పోస్టర్ ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేసే విధంగా ఉన్నాయి. కీర్తి, మహేష్ మాస్ స్టెప్పులు వేస్తున్న పోస్టర్ అదిరిపోయింది.
సాంగ్ ఇప్పుడే చూడడం జరిగింది. స్టూడియోలో ఉన్న స్టాఫ్ అంతా గెంతులేయడం కూడా జరిగింది అంటూ తమన్ కామెంట్స్ చేశారు. దీనితో ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్లాసీగా కనిపించే కీర్తి సురేష్ తొలి సారి మహేష్ బాబుతో కలసి మాస్ స్టెప్పులు వేస్తే థియేటర్స్ లో రచ్చ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మే 12న సర్కారు వారి పాట చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.