`#PKlove` అంటూ పూనమ్‌ కౌర్ పోస్ట్‌.. నెట్టింట దుమారం..

Published : Oct 08, 2021, 07:24 PM ISTUpdated : Oct 08, 2021, 07:25 PM IST
`#PKlove` అంటూ పూనమ్‌ కౌర్ పోస్ట్‌.. నెట్టింట దుమారం..

సారాంశం

పూనమ్‌ కౌర్‌ పెడుతున్న పోస్టులు చర్చనీయాంశంగా మారుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఆమె స్పందించింది. ట్విట్టర్‌ ద్వారా ఆమె పంచుకున్న యాష్‌ ట్యాగ్‌ ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా అవుతుంది.   

నటి పూనమ్‌ కౌర్‌ మరోసారి వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఆమె పెట్టిన సోషల్‌ మీడియా పోస్టే అందుకు కారణం. ఎప్పుడూ సంచలన పోస్ట్ లతో సంచలనాలకు తెరలేపుతుంది పూనమ్ కౌర్‌. పవన్‌ కళ్యాణ్‌కి సపోర్ట్ గా పోస్టులు పెడుతూ చర్చనీయాంశంగా మారుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఆమె స్పందించింది. ట్విట్టర్‌ ద్వారా ఆమె పంచుకున్న యాష్‌ ట్యాగ్‌ ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా అవుతుంది. 

ఇందులో poonam kaur జస్ట్ `#PKlove` అనే యాష్‌ ట్యాగ్‌ని పంచుకుంది. అయితే ఈ ట్యాగ్‌ అర్థమేంటనేది వెతికేపనిలో పడ్డారు నెటిజన్లు. `పూనమ్‌ కౌర్‌` లవ్‌ అనే అర్థంలో ఆమె ఈ పోస్ట్ పెట్టిందంటున్నారు. అందుకు తగ్గట్టే ఆమె తన ఫోటోలను పంచుకుంది. అయితే ఇందులోనే అనేక అర్థాలున్నాయంటున్నారు నెటిజన్లు. పూనమ్‌ కౌర్‌ మాత్రమే కాదు, పవన్‌ కళ్యాణ్‌ అనే అర్థం కూడా వస్తుందంటున్నారు. పైగా ఆయనకు సపోర్ట్ గా పూనమ్‌ పోస్టులు పెడుతున్న నేపథ్యంలో ఇందులో ఆ అర్థం కూడా ఉందంటున్నారు. 

మరి ఇదే కాకుండా `#pklove` లో చాలా అర్థాలున్నాయంటున్నారు మరికొంత మంది నెటిజన్లు. మరి అదేంటో తెలియాల్సి ఉంది. కానీ ఇందులో పూనమ్‌ పంచుకున్న తన క్యూట్‌ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల `మా` ఎలక్షన్లపై స్పందించింది పూనమ్‌. ప్రకాష్‌రాజ్‌కి సపోర్ట్ చేస్తున్నట్టు పేర్కొంది. ఆయనతో దిగిన ఫోటోని కూడా పంచుకుంది. 

also read: ఎన్టీఆర్ తో సమంత ఆట.. క్రేజీ న్యూస్, విడాకుల తర్వాత తొలిసారి..

మరోవైపు దివంగత దర్శకుడు దాసరి నారాయణ రావు గురించి ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది. చిత్ర పరిశ్రమలో నా ఏకైక గురువు దాసరి నారాయణ రావు. ఆయనను చాలా మిస్సవుతున్నారు. దాసరి గారికి నేనొక సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నా. దేవుడు దీనిని ఆయనకు చేరవేస్తాడని ఆశిస్తున్నా` అంటూ ఆమె తెలిపింది పూనమ్‌. ఇది చర్చనీయాంశంగా మారింది.

`మాయాజాలం` చిత్రంతో తెలుగులోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది పూనమ్‌ కౌర్‌. `ఒక వి చిత్రం`,`శౌర్యం`, `వినాయకుడు`, `ఈనాడు`, `గణేష్‌`, `నాగవళ్లీ`, `పయణం`, `గగనం`, `ఆడు మగాడ్రా బుజ్జి`,`పొగ`, `సూపర్‌స్టార్‌ కిడ్నాప్‌`, `ఎటాక్‌`,`నాయకి`, `శ్రీనివాస కళ్యాణం`, `నెక్ట్స్ ఏంటి?` చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం సినిమాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది పూనమ్‌. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు