ప్రొడక్షన్‌లోకి లెజెండరీ దర్శకుడు కోడి రామకృష్ణ కూతురు.. కిరణ్‌ అబ్బవరంతో సినిమా

By Aithagoni RajuFirst Published Oct 8, 2021, 6:39 PM IST
Highlights

లెజెండరీ దర్శకుడు కోడి రామకృష్ణ కూతురు నిర్మాణంలోకి అడుగుపెడుతుంది. `ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం`తో విజయాన్ని అందుకున్న కిరణ్‌ అబ్బవరం హీరోగా సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దిగ్గజ సెలబ్రిటీల సమక్షంలో శుక్రవారం ప్రారంభమైంది.

`ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం` చిత్రంతో మంచి హిట్‌ని అందుకున్నాడు కిరణ్‌ అబ్బవరం. హీరోగా టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. ఇక టాలీవుడ్‌లో అనేక బ్లాక్‌బస్టర్‌ చిత్రాలతో టాలీవుడ్‌లో అగ్ర దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు కోడిరామకృష్ణ. ఈ లెజెండరీ డైరెక్టర్ కూతురు కోడి దివ్వ దీప్తి. ఈ కాంబినేషన్‌లో ఇప్పుడు సినిమా రాబోతుంది. కిరణ్‌ అబ్బవరం హీరోగా, కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్నారు. ఇందులో సంజన ఆనంద్‌ కథానాయికగా నటిస్తుంది. కార్తీక్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ కొత్త సినిమా శుక్రవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, ఎస్వీ కృష్ణారెడ్డి, మురళీ మోహన్‌, నిర్మాత అల్లు అరవింద్‌, అచ్చిరెడ్డి, సంగీత దర్శకుడు కోటి, రాజా రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. ముహూర్తపు సన్ని వేశానికి హీరో, హీరోయిన్ లపై నిర్మాత రామలింగేశ్వర రావు క్లాప్ నివ్వగా, ప్రముఖ దర్శకుడు ఏ.యమ్ రత్నం స్విచాన్‌ చేశారు, లెజెండరీ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించారు. 

చిత్ర హీరో kiran abbavaram మాట్లాడుతూ, `కోడి రామకృష్ణ గారి దీవెనలతో చాలా మంది పెద్దల ఆశీస్సులతో మా మూవీ స్టార్ట్ ఆయినందుకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. నిర్మాత deepthi గారు మొదటినుంచి నన్ను ఇంట్లో మనిషిలా చూసుకుంటారు. నాకిది హోమ్‌ ప్రొడక్షన్‌ లాంటిది. మణిశర్మ గారి మ్యూజిక్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. `నరసింహ నాయుడు`, `ఇంద్ర` పాటలు విని థియేటర్ లో గోల చేసే వాడిని ఇప్పుడు ఆయన నా సినిమాకు మ్యూజిక్  చేయడం చాలా సంతోషంగా ఉంది. 

భాస్కరభట్ల ప్రతి మూవీ ని ఒన్ చేసుకొని రాశారు. ఈ సినిమాకు మంచి లిరిక్స్ ఇచ్చారు. రాజ్ గారితో సెబాస్టియన్ తరువాత చేస్తున్న రెండవ సినిమా ఇది. కార్తీక్ శంకర్ చాలా మంచి స్క్రిప్ట్ తో తీసుకొచ్చాడు. ఇది చక్కటి కుటుంబ కథా చిత్రం. ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది. స్క్రిప్ట్ వర్క్ చాలా బాగా వచ్చింది. ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఈ సినిమా కు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని అన్నారు.

also read: కుక్కల గురించి ట్వీట్ చేశా... సమంత గురించి కాదు, బాధపడితే నేనేం చేయలేను: సిద్ధార్థ్ వ్యాఖ్యలు

చిత్ర దర్శకుడు కార్తీక్ శంకర్ మాట్లాడుతూ, ఇది నా మొదటి చిత్రం లెజెండరీ డైరెక్టర్ kodi ramakrishna గారి బ్యానర్లో నేను దర్శకుడిగా పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన కోడి దివ్య గారికి ధన్యవాదాలు` అని తెలిపారు.  చిత్ర నిర్మాత కోడిదివ్య మాట్లాడుతూ, మంచి సినిమా తీయాలని మేము మా బ్యానర్లో ఫస్ట్ స్టెప్ వేస్తున్నాము. మీ అందరి సపోర్ట్  మాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుతున్నా` అని అన్నారు.

click me!