కుక్కల గురించి ట్వీట్ చేశా... సమంత గురించి కాదు, బాధపడితే నేనేం చేయలేను: సిద్ధార్థ్ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Oct 08, 2021, 06:29 PM ISTUpdated : Oct 08, 2021, 06:50 PM IST
కుక్కల గురించి ట్వీట్ చేశా... సమంత గురించి కాదు, బాధపడితే నేనేం చేయలేను: సిద్ధార్థ్ వ్యాఖ్యలు

సారాంశం

సమంతను (samantha) ఉద్దేశించి తాను ట్వీట్ చేయలేదని వివరణ ఇచ్చాడు సిద్ధార్థ (siddharth). తన జీవితంలో జరిగినదే తాను ట్వీట్ చేశానని.. ఎవరో తన గురించి అనుకుంటే తానేమి చేయలేదని సిద్ధార్ధ్ ఓ తెలుగు వార్తా సంస్థతో అన్నారు

సమంతను (samantha) ఉద్దేశించి తాను ట్వీట్ చేయలేదని వివరణ ఇచ్చాడు సిద్ధార్థ (siddharth). తన జీవితంలో జరిగినదే తాను ట్వీట్ చేశానని.. ఎవరో తన గురించి అనుకుంటే తానేమి చేయలేదని సిద్ధార్ధ్ ఓ తెలుగు వార్తా సంస్థతో అన్నారు. తమ ఇంటి దగ్గర కుక్కల సమస్య వుంటే .. తాను దానికి ట్వీట్ చేస్తే, దానికి ఎవరో బాధపడితే తనకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. సిద్ధార్థ్‌, శర్వానంద్‌ కలిసి `మహాసముద్రం` చిత్రంలో నటించారు. `ఆర్ఎక్స్ 100` ఫేమ్‌ అజయ్‌ భూపతి దర్శకుడు.ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్ననేపథ్యంలో చిత్రప్రమోషన్‌ కోసం హైదరాబాద్‌ వచ్చాడు సిద్ధార్థ్‌. ఇందులో భాగంగా ఆయన మీడియాతో ముచ్చటించారు.

కాగా, సమంత- నాగచైతన్య విడాకుల (samantha naga chaitanya divorce) ప్రకటన వెలువడిన రోజున సిద్ధార్ధ్ ఓ ట్వీట్ చేశారు `స్కూల్‌లో మా టీచర్‌ నేర్చించిన తొలి పాఠం. మోసం చేసేవాళ్లు ఎప్పుడు బాగుపడరు. నీ విషయంలో ఏమైంది?` అని ప్రశ్నించారు సిద్ధార్థ్‌. అయితే తన ట్వీట్‌లో సమంత పేరుని పేర్కొనలేదు. కానీ సిద్ధార్థ్‌ మాత్రం సమంతని ఉద్దేశించే పెట్టారని నెటిజన్లు అంటున్నారు. ఇందులో కొందరు సిద్దార్థ్‌కి సపోర్ట్ చేస్తుంటూ, మరికొందరు నెగటివ్‌ కామెంట్లు పెడుతున్నారు. 

Also Read:సమంత-చైతూ విడాకులు.. సిద్ధార్థ్‌ సంచలన ట్విట్‌.. వైరల్‌

ఇదిలా ఉంటే చైతూ కంటే ముందు సమంత.. సిద్ధార్థ్‌తో ప్రేమాయణం సాగించిందని వార్తలొచ్చాయి. సిద్ధార్థ్‌ కోసం శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు కూడా చేసింది సమంత. అంతేకాదు సిద్ధార్థ్‌, సమంత కలిసి `జబర్దస్త్` (jabardasth movie) సినిమాలో నటించారు. ఆ సినిమా టైమ్‌లో వీరిద్దరి మధ్య లవ్‌ బాగా పెరిగిందని, వీరిద్దరు మ్యారేజ్‌ కూడా చేసుకునే అవకాశాలున్నాయంటూ వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత సడెన్‌గా బ్రేకప్‌ చెప్పుకున్నారు. 

ఈ సందర్భంగా సమంత ఓ పోస్ట్ పెట్టింది. తను కూడా `సావిత్రి` లాగే (mahanati savithri) ఇరుక్కుపోయానని, కానీ లక్కీగా త్వరగా తెలుసుకుని దాన్నుంచి బయట పడ్డానని తెలిపింది సమంత. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. సిద్ధార్థ్‌తో బ్రేకప్‌ తర్వాత చైతూకి దగ్గరైంది సమంత. వీరిద్దరూ డేటింగ్‌ చేసి 2016లో తమ ప్రేమకి ఎస్‌ చెప్పుకున్నారు. పెళ్లికి పెద్దలను ఒప్పందం కుదుర్చుకుని 2017లో అక్టోబర్‌ 6,7తేదీల్లో క్రిస్టియన్‌, హిందూ సంప్రాదాయల ప్రకారం వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ