
తెలుగులో అడపాదడరా అవకాశాలొచ్చినా.. ఎందుకో అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది పూనమ్ కౌర్. తెలుగులో టాలెంట్ వున్న హీరోయిన్స్ లో పూనమ్ కౌర్(దీప) కూడా వుంటుంది. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన పంజాబీ భామ పూనమ్ కౌర్ హైదరాబాద్ లోనే సెటిలైంది.
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హాండ్లూమ్ బ్రాండ్ అంబాజిడర్ గా పూనమ్ ఎంపికైనట్లు తెలుస్తోంది. నిజానికి ఇలాంటి అవకాశం రావడం పూనమ్ లక్కీ అనే చెప్పాలి. నిజానికి చేనేత వస్త్రాలు ధరిస్తూ తన వంతు సపోర్ట్ ఇస్తూ వుండేది పూనమ్. దాంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ఇంప్రెస్ అయి పూనమ్ ను బ్రాండ్ ఎంబాజీడర్ గా నియమించారు.
ఇక చేనేత బ్రాండ్ ఎంబాజిడర్ గా పూనమ్ పనితీరును చూసేందుకు రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఇలాంటి అవకాశం పూనమ్ కు రావడం లక్కీ అని చెప్పాలి.