పొల్లాచీలో బెల్లంకొండ సాహసాలు..

Published : Sep 12, 2017, 05:18 PM ISTUpdated : Mar 25, 2018, 11:41 PM IST
పొల్లాచీలో బెల్లంకొండ సాహసాలు..

సారాంశం

‘జయ జానకీ నాయక’ తో హిట్ కొట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ కొత్త సినిమా హీరోయిన్ గా పూజా హెగ్డే

‘జయజానకీ నాయక’ చిత్ర విజయానందంలో మునిగి తేలుతున్నాడు.. హీరో బెల్లం కొండ శ్రీనివాస్. ప్రస్తుతం ఆయన శ్రీవాస్ దర్శకత్వంలో  ఓ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీనివాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రాన్ని అభిషేక్  పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మిస్తున్నారు.

 

అయితే.. ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగానే.. పొల్లాచీలో ఫైటర్ పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు.  అందుకోసం మా ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్.ప్రకాష్ గారి సారధ్యంలో విండ్ టర్బైన్స్ తో కలిపి ఓ భారీ సెట్ ను రూపొందించారంట. బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాంటి డూప్ లేకుండా ఈ ఫైట్ సీక్వెన్స్ లో పాల్గొన్నాడని.. ఈ భారీ ఫైట్  సినిమాకి చాలా కీలకమని నిర్మాత అభిషేక్ తెలిపారు.

 

జగపతిబాబు, శరత్ కుమార్, మీనా, వెన్నెల కిషోర్, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ
Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్