
మణిరత్నం సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన సినిమాల కోసం ఇప్పటికి ఎదురుచూస్తూంటారు. దాంతో ఆయన దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా పొన్నియిన్ సెల్వన్ కి రిలీజ్ ముందు మంచి క్రేజ్ వచ్చింది. సెప్టెంబర్ 30 2022న ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల అయ్యింది. ఈ సినిమాలో ముఖ్యపాత్రలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష నటించారు. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేశారు. ఒక్క తమిళ్‌లో తప్ప మిగితా ఎక్కడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో టీవీల్లో అయినా జనం బాగా చూస్తారని భావించారు. అయితే అక్కడా అదే పరిస్దితి.
ఈ సినిమా తెలుగు వెర్షన్ ..తాజాగా టీవీలో ప్రసారం అయ్యింది. జెమినీలో టెలివిజన్ ప్రీమియర్‌గా ఆదివారం ప్రసారం అయ్యిన ఈ సినిమాకు తెలుగులో డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్‌లోనే కాదు టీవీలోను ఈ సినిమా పట్ల తెలుగు వారు ఇంట్రెస్ట్ చూపలేదు. ఈ సినిమాకు 2.17 రేటింగ్ వచ్చింది. ఓ పెద్ద ప్యాన్ ఇండియా సినిమాకు, అది మల్టీ స్టార్రర్ సినిమాకు మరీ ఈ రేంజ్‌లో రెస్పాన్స్ రావడం ఏంటీ అనేది పెద్ద ఆశ్చర్యమే.
‘కల్కి’ కృష్ణమూర్తి తమిళంలో రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ అనే ప్రముఖ నవల ఆధారంగా ఈ సినిమా తీసారు. కా 5 సంపుటిల ఈ నవలను ఒక సినిమాగా తీయడం కత్తిమీద సామే. ఇందులో ఉన్న పాత్రలు వాటి తీరు.. ఆ పాత్రలను ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చూపించడం చాలా కష్టమనే చాలా మంది అభిప్రాయం. అయినప్పటికీ ఏస్ డైరెక్టర్ మణిరత్నం ధైర్యం చేశారు. రెండు భాగాలుగా విభజించి.. మొదటి భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాను మణిరత్నం కేవలం 155 రోజుల్లో పూర్తిచేశారు. అయినప్పటికీ నిర్మాణ విలువల్లో మాత్రం కాంప్రమైజ్ కాలేదు.
మరో ప్రక్క ఈ సినిమా రెండో పార్ట్‌కు సంబంధించిన విడుదల తేదిని చిత్రబృదం ప్రకటించింది. ఓ ఇంట్రెస్టింగ్ వీడియోతో ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2023, ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.