#AlluArjun:ఆ విషయంలో 'ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్' గా బన్ని రికార్డ్

Published : Mar 02, 2023, 07:07 PM IST
  #AlluArjun:ఆ విషయంలో 'ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్' గా బన్ని రికార్డ్

సారాంశం

వృత్తిపరంగా, వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండటమే అందుకు కారణం. ఎప్పటికప్పుడు తన చిత్రాల లెటెస్ట్ అప్డేట్స్ ఇవ్వటం కన్నా... 


సౌత్ ఇండియా లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్‌కి  అభిమానుల అభిమానానికి హద్దే లేదు అనే సంగతి తెలిసిందే.  పుష్ప వంటి బ్లాక్ బస్టర్ తో ప్యాన్ ఇండియా పాపులారిటీ ని సాధించి  ప్రపంచం లో అభిమానుల్ని సంపాయించుకునిలో పడ్డాడు   అల్లు అర్జున్‌. వీటిన్నటికంటే కేరళలో అతనికి వీరాభిమానులు ఉన్నారు. అందుకే అభిమానులు అల్లు అర్జున్ ని  కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అని పిలుచుకుంటారు. ఆయన సినిమాల కంటెంట్ ఏదైనా ఆన్‌లైన్‌లో విడుదలైతే చాలు టాప్ లో ఉంటాయి. 

దాంతో యాజటీజ్ గా సోషల్ మీడియాలో బన్నీ హవా నడుస్తోంది. తాజాగా  మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు అల్లు అర్జున్.  తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఎక్కువ మంది ఫాలోవర్లను కలిగి ఉండటం ద్వారా  20 మిలియన్స్  మైలురాయిని సాధించిన తొలి దక్షిణాది భారత నటుడు గా రికార్డ్ సాధించారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండటమే అందుకు కారణం. ఎప్పటికప్పుడు తన చిత్రాల లెటెస్ట్ అప్డేట్స్ ఇవ్వటం కన్నా... తన భార్య స్నేహ మరియు పిల్లలు అయాన్ మరియు అర్హాతో ఆయన చిత్రాలు మరియు వీడియోలను షేర్ చేయటంలో పాపులర్ అయ్యారు.

ఇక కెరీర్ విషయానికి వస్తే.. అల్లు అర్జున్ హీరోగా  సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప ది రైజ్’. 2021 డిసెంబ‌ర్‌లో విడుద‌లైన ఈ చిత్రం ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో అంద‌రికి తెలిసిందే. బాక్సాఫీస్‌ దగ్గర రూ.350 కోట్లకు పైగా కలెక్షన్‌లు సాధించి అల్లుఅర్జున్‌కు నేషన్  వైడ్ గుర్తింపు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ చిత్రం ఎలాంటి ప్రమోష‌న్లు చేయ‌కుండానే రూ.100 కోట్ల నెట్ సాధించి అక్క‌డి విశ్లేష‌కుల‌ను సైతం ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది. ప్రస్తుతం పుష్ప సీక్వెల్‌ కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది.కాస్త లేటుగా షూటింగ్ మొదలైంది.   
  
 పుష్ప సినిమాలో తాను చెప్పిన డైలాగ్ తగ్గేదేలే ఎలా హిట్ అయిందో మనకు తెలిసిందే.అయితే పుష్ప2 లో మాత్రం అస్సలు తగ్గేదేలే అనే డైలాగ్ ఉండబోతుంది అంటూ  అల్లు అర్జున్ తన సినిమా గురించి అప్డేట్ గతంలో ఇచ్చారు. దాంతో ఈ సినిమా గురించి  అభిమానులు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తూ అస్సలు తగ్గకూడదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?