లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనాలు... చిరంజీవి ఆస్తి విలువ ఎన్ని కోట్లో తెలుసా?

By Sambi Reddy  |  First Published Aug 22, 2024, 7:24 AM IST


చిరంజీవి దేశంలోనే అత్యంత సంపన్నమైన హీరోల్లో ఒకరు. ఆయన ఆస్తుల వివరాలు చూస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు చిరంజీవి ఆస్తి విలువ ఎన్ని కొట్లో తెలుసా?
 


ఎలాంటి సినిమా నేపథ్యం లేని ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకు ఇండస్ట్రీని శాసించే హీరో అవుతాడని ఎవరూ ఊహించి ఉండరు. కృషి, పట్టుదల ఉంటే అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని చిరంజీవి నిరూపించాడు. శివ శంకర్ వరప్రసాద్ కాస్త చిరంజీవిగా మారి సిల్వర్ స్క్రీన్ పై మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నాడు. ప్రాణం ఖరీదు నుండి పద్మ విభూషణ్ వరకు ఆయన ప్రస్థానం సాగింది. 

పరిశ్రమలో రాణించాలి అంటే మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని భావించిన చిరంజీవి ఆ దిశగా కృషి చేశాడు. ముఖ్యంగా చిరంజీవి బెస్ట్ డాన్సర్ అనిపించుకున్నాడు. ఆ రోజుల్లో ఒక్క స్టార్ హీరో కూడా ప్రొఫెషనల్ డాన్సర్ కాదు. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న చిరంజీవి తెలుగు ప్రేక్షకులకు బ్రేక్ డాన్స్ పరిచయం చేశాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ చిరంజీవి సుప్రీం హీరో ఆ తర్వాత మెగాస్టార్ అయ్యారు. 

Latest Videos

ఇండియాలో కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న మొదటి హీరో చిరంజీవి. గ్యాంగ్ లీడర్ సక్సెస్ తర్వాత చిరంజీవి రెమ్యూనరేషన్ కోటి రూపాయలు దాటేసింది. అమితాబ్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో అని ఓ ఆంగ్ల మీడియా కవర్ పేజ్ పై చిరంజీవి ఫోటో విడుదల చేసింది. తనకు ఈ వైభవం అభిమానులు, ప్రేక్షకుల వలనే అని భావించిన చిరంజీవి బ్లడ్, ఐ బ్యాంకు ఏర్పాటు చేశారు. అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. 

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ టాప్ స్టార్స్ గా దశాబ్దాల పాటు కొనసాగారు. ఇప్పటి తరం స్టార్ హీరోలకు పోటీ ఇస్తున్న ఏకైక సీనియర్ హీరో చిరంజీవి మాత్రమే. ఆయన సినిమాకు రూ. 45 కోట్లు తీసుకుంటున్నారు. చిరంజీవి దేశంలోనే అత్యంత ధనవంతుడైన హీరో. ఆయనకు విలాసవంతమైన భవనాలు. లగ్జరీ కార్లు, ఫార్మ్ హౌసులు, వ్యాపారాల్లో పెట్టుబడులు ఉన్నాయి. 

జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 25లో చిరంజీవికి ఓ లగ్జరీ హౌస్ ఉంది. అత్యంత అధునాతన సౌకర్యాలతో కూడిన ఈ విలాస భవనం విలువ రూ. 50 కోట్లకు పైమాటే. ఈ భవనం కోసం చిరంజీవి రూ. 30 కోట్లు ఖర్చు చేశారట. అలాగే చిరంజీవికి బెంగళూరులో ఫార్మ్ హౌస్ ఉంది. చెన్నైలో ఇళ్ళు ఉన్నాయి. చిరంజీవి వద్ద అత్యంత ఖరీదైన కార్ కలెక్షన్ ఉంది. రోల్స్ రాయిస్ వాటిలో ప్రత్యేకం. దానితో పాటు బెంజ్, రేంజ్ రోవర్, ఆడి, టయోటా హై ఎండ్ కార్స్ ఆయన కొనుగోలు చేశారు. 

ప్రైవేట్ జెట్ కలిగిన అతికొద్ది మంది హీరోల్లో చిరంజీవి ఒకరు. చిరంజీవి ఫ్యామిలీ డొమెస్టిక్ గా ఎక్కడికి వెళ్లాలన్నా ఈ ప్రైవేట్ జెట్ లో వెళతారు. ఒక అంచనా ప్రకారం చిరంజీవి ఆస్తుల విలువ రూ. 2 వేల కోట్లు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆగస్టు 22న ఆయన జన్మదినం కాగా 69వ ఏట అడుగుపెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిరంజీవి అభిమానులు వేడుకలు జరుపుకుంటున్నారు. 
 

click me!