నాకిష్టమైన వాళ్లకోసం నేనొస్తా.. అల్లు అర్జున్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. మెగాఫ్యామిలీకి కౌంటరా? బన్నీ తగ్గడం లేదే

By Aithagoni Raju  |  First Published Aug 21, 2024, 11:57 PM IST

పవన్‌ కళ్యాణ్‌ తో ఏపీ ఎన్నికల సమయంలో బన్నీకి కొంత గ్యాప్‌ వచ్చిన విషయం తెలిసిందే. అద పెద్ద వివాదమైంది. కానీ బన్నీ ఇప్పుడు కూడా తగ్గడం లేదు. మరో బోల్డ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. 
 


ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. ప్రస్తుతం `పుష్ప 2`లో నటిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఈ డిసెంబర్ లో ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సినిమా ఈవెంట్‌లో మెరిశారు బన్నీ. సుకుమార్‌ భార్య తబిత సుకుమార్‌ సమర్పకులుగా వ్యవహరిస్తున్న `మారుతీనగర్‌ సుబ్రమణ్యం` సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా వచ్చారు బన్నీ. ఇందులో ఆయన మాట్లాడుతూ, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు మరో దుమారం రేపేలా ఉన్నాయి. మానిపోతున్న పుండుపై కారం చల్లినంత పనైంది. 

ఏపీ ఎన్నికల విషయంలో మెగా, అల్లు వారి ఫ్యామిలీ మధ్య గ్యాప్‌ వచ్చింది. బన్నీ.. పవన్‌కి సపోర్ట్ చేస్తూ ప్రచారం నిర్వహించకుండా ప్రత్యర్థి పార్టీ వైసీపీకి చెందిన నంధ్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రా రెడ్డి కోసం ప్రచారం చేశాడు. స్వయంగా వెళ్లి ప్రచారంలో పాల్గొన్నాడు. ఇది పెద్ద వివాదంగా మారింది. మెగా ఫ్యాన్స్, పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నాగబాబు సైతం పరోక్షంగా మండిపడ్డాడు. ఇది ఫ్యాన్స్‌ మధ్య పెద్ద వార్‌కి దారితీసింది. అయితే ఇది ఫ్యాన్స్ కే పరిమితం వాళ్ల ఫ్యామిలీ అంతా బాగానే ఉంటారని అనుకున్నారు. కానీ నిజంగానే రెండు ఫ్యామిలీల మధ్య వివాదం రాజుకున్నట్టు వాళ్లు స్పందిస్తున్న తీరుని చూస్తుంటే తెలుస్తుంది. రెండు ఫ్యామిలీల మధ్య గ్యాప్‌ కనిపిస్తుంది. ఇష్యూ సీరియస్‌గానే ఉందని అర్థమవుతుంది. 

Latest Videos

ఈ నేపథ్యంలో తాజాగా బన్నీ కామెంట్లు మరింత దుమారం రేపేలా ఉన్నాయి. `మారుతీనగర్‌ సుబ్రమణ్యం` ఈవెంట్‌లో బన్నీ మాట్లాడుతూ, తనకు తబిత ఫోన్‌ చేసి గెస్ట్ గా రమ్మని ఆహ్వానించిందట. నిజానికి ఆ సమయంలో తాను చాలా హెక్టిక్‌ షెడ్యూల్‌లో ఉన్నాడట. `పుష్ప 2` క్లైమాక్స్‌ షూట్‌ జరుగుతుందని, అది మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్, టైరింగ్‌ క్లైమాక్స్. రాలేని పరిస్థితి అని, కానీ తబిత ఉండి.. నిన్ను కాకుండా ఎవరిని పిలుస్తాను, నా కోసం నువ్వు రాకుండా ఇంకా ఎవరు వస్తారు చెప్పు అని అడిగిందట. ఆ మాట కోసం తాను ఈ ఈవెంట్‌కి వచ్చానని తెలిపాడు అల్లు అర్జున్‌. 

`ఎందుకంటే ఇష్టమైన వాళ్ల కోసం మనం చూపించాలి. మనం నిలబడాలి. మన ఫ్రెండ్‌ అనుకో, మనకు కావాల్సిన వాళ్లు అనుకో,  నాకిష్టమైతే నేనొస్తా. నా మనసుకి నచ్చితే నేనొస్తా` అంటూ బన్నీ బోల్డ్ గా స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఆ విషయం మీ అందరికి తెలుసు అంటూ వెల్లడించాడు బన్నీ. ఇదే ఇప్పుడు రచ్చ అవుతుంది. ఎన్నికల ప్రచార సమయంలో జరిగింది ఇదే. పవన్‌ కోసం వెళ్లకుండా, తన భార్య స్నేహారెడ్డి ఫ్రెండ్‌ భర్త కోసం వెళ్లడమే అందరిని ఆశ్చర్యపరిచింది. దానికి ఇప్పుడు పరోక్షంగా ఈ ఈవెంట్‌ వేదికగా కౌంటర్‌ ఇచ్చినట్టుగా ఉంది. పరోక్షంగా పవన్‌ అభిమానులకు, మెగా ఫ్యాన్స్ కి, ఆ విషయాన్ని వ్యతిరేకించిన వారికి బన్నీ కౌంటర్‌లా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చూడబోతుంటే ఇంత వివాదం జరుగుతున్న బన్నీ తగ్గడం లేదు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఇది మున్ముందు ఎలాంటి రచ్చకి కారణమవుతుందో చూడాలి. 
 

click me!