Bigg boss telugu5: సిరికి ఐ లవ్ యూ చెప్పిన దేవరకొండ బ్రదర్... ఉబ్బితబ్బి అవుతున్న బేబీ!

Published : Oct 31, 2021, 08:59 PM ISTUpdated : Oct 31, 2021, 09:00 PM IST
Bigg boss telugu5: సిరికి ఐ లవ్ యూ చెప్పిన దేవరకొండ బ్రదర్... ఉబ్బితబ్బి అవుతున్న బేబీ!

సారాంశం

దివాళి స్పెషల్ బిగ్ బాస్ ఎపిసోడ్ కి స్పెషల్ గెస్ట్స్ గా దేవరకొండ బ్రదర్స్ విజయ్, ఆనంద్ రావడం జరిగింది. వస్తూ వస్తూ హోస్ట్ నాగార్జునతో పాటు కంటెస్టెంట్స్ కి గిఫ్ట్స్ తీసుకు వచ్చారు.

దివాళి స్పెషల్ బిగ్ బాస్ ఎపిసోడ్ కి స్పెషల్ గెస్ట్స్ గా దేవరకొండ బ్రదర్స్ విజయ్, ఆనంద్ రావడం జరిగింది. వస్తూ వస్తూ హోస్ట్ నాగార్జునతో పాటు కంటెస్టెంట్స్ కి గిఫ్ట్స్ తీసుకు వచ్చారు. కంటెస్టెంట్స్ కోసం స్పెషల్ స్వీట్స్ తెచ్చారు విజయ్ దేవరకొండ.నాగార్జున గ్లామర్ సీక్రెట్ అడిగిన విజయ్ దేవరకొండ అడిగి తెలుసుకున్నారు. ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ మూవీ పుష్పక విమానం ట్రైలర్ ని బిగ్ బాస్ వేదికపై ప్రదర్శించడం జరిగింది. 

నాగార్జున ఫుల్ గా ఎంజాయ్ చేశారు  పుష్పక విమానం ట్రైలర్. Nagarjuna భార్య అమల నటించిన ఒకప్పటి పుష్పక విమానం సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. కాగా ఎలిమినేషన్స్ లో ఉన్న నలుగురిలో ఒకరిని విజయ్ దేవరకొండ సేవ్ చేస్తారని నాగార్జున చెప్పారు. ఒక బాంబుని పోలిన టాయ్ ని స్టేజ్ పైకి తెచ్చిన నాగార్జున, తాను పేరు చెబుతున్నప్పుడు ఒక్కో వైర్ కట్ చేయాలని, వైర్ కట్ చేసినప్పుడు బాంబు పేలిన సౌండ్ వచ్చినవారు సేవ్ కానట్లు, పేలిన సౌండ్ రాకపోతే సేవ్ అయినట్లు చెప్పారు. 

మొదట లోబో పేరు చెప్పగా Vijay devarakonda వైర్ కట్ చేశారు. బాంబు పేలిన సౌండ్ రావడం జరిగింది. దానితో లోబో సేవ్ కాలేదు. రెండో వైర్ శ్రీరామ్ కోసం కట్ చేయగా మరలా సౌండ్ వచ్చింది. అలా లోబో, శ్రీరామ్ సేవ్ కాలేదు.తన హ్యాండ్ బాగోలేదని విజయ్ దేవరకొండ కట్టర్ ఆనంద్ కి ఇచ్చారు. 

Also read Bigg Boss Telugu5: రెచ్చిపోయి డాన్స్ చేసిన దివి, మోనాల్.. హాట్ హాట్ గా అదరగొట్టేశారు

సిరి పేరు చెప్పగా, ఆనంద్ వైర్ కట్ చేశారు. సౌండ్ రాకపోవడంతో siri సేవ్ అయ్యారు. తనను ఆనంద్ దేవరకొండ సేవ్ చేశాడన్న ఆనందంలో సిరి... '' ఐ లవ్ యూ ఆనంద్' అంటూ పలుమార్లు చెప్పింది. ఆమెకు Anand devarakonda సైతం ఐ లవ్ యూ చెప్పడం జరిగింది. ఇక రవి సైతం సేవ్ కాలేదు. అప్పటి వరకు ముగ్గురు ఎలిమినేషన్స్ లో ఉన్నారు. అనంతరం స్పెషల్ గెస్ట్ గా వచ్చిన హీరోయిన్ అవికా గోర్ రవి, లోబో, శ్రీరామ్ నుండి శ్రీరామ్ సేవ్ అయినట్లు చెప్పారు. ఇక ఎలిమినేషన్స్ లో రవి, లోబో మిగిలారు. 

Also read Bigg boss telugu5: సిరి షన్ను ముద్దులు, కాజల్ గొడవలు, మానస్ కి పింకీ సేవలు, కంటెస్టెంట్స్ తాటతీసిన సుమ

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే