అపార్ట్ మెంట్‌లో అర్థరాత్రి గొడవః నిహారిక భర్తకి, అపార్ట్ మెంట్‌ వాసులకు మధ్య రాజీ

Published : Aug 05, 2021, 11:51 AM IST
అపార్ట్ మెంట్‌లో అర్థరాత్రి గొడవః నిహారిక భర్తకి, అపార్ట్ మెంట్‌ వాసులకు మధ్య రాజీ

సారాంశం

దీనిపై పోలీసులు స్పందించారు. అటు నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డని, ఇటు అపార్ట్ మెంట్‌ వాసులను పిలిచి పోలీసు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. 

మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె నిహారిక భర్తకి, అపార్ట్‌మెంట్‌ వాసుల మధ్య అర్థరాత్రి జరిగిన గొడవలో ఇరు వర్గాలు బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై పోలీసులు స్పందించారు. అటు నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డని, ఇటు అపార్ట్ మెంట్‌ వాసులను పిలిచి పోలీసు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఇద్దరి మధ్య పోలీసులు రాజీ కుదిర్చారు. జరిగిన దానిపై ఇరు వర్గాల వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి  దీన్ని సమస్య పరిష్కారమయ్యింది. ఈ నేపథ్యంలో పరస్పారం చేసుకున్న ఫిర్యాదులను వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తుంది. 

ఏమైందో ఏమోగానీ అర్థరాత్రి అర్థరాత్రి నిహారిక-చైతన్య నివసిస్తున్న అపార్ట్ మెంట్‌లో గొడవ జరిగింది.  చైతన్య నైట్‌ టైమ్‌లో న్యూసెన్స్ చేస్తున్నాడంటూ అపార్ట్ మెంట్‌ వాసులు ఆయనతో గొడవకి దిగారు. దీంతో నైట్‌ అపార్ట్ మెంట్‌లో పెద్ద రచ్చ అయ్యింది. ఓ వైపు చైతన్యకి, మరోవైపు అపార్ట్ మెంట్‌ వాసులకు మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. దీంతో అపార్టు‌మెంటు వాసులంతా చైతన్యపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే అపార్ట్ మెంట్ వాసులపై నిహారిక భర్త సైతం ఫిర్యాదు చేశారు. పోలీసులు పరస్పర ఫిర్యాదులను స్వీకరించి ఇద్దరిని పిలిపించి రాజీ కుదిర్చారని సమాచారం.

మెగా బ్రదర్‌ నాగబాబు గారాల పట్టి అయిన నిహారికకి.. గుంటూరుకి చెందిన ఐజీ ప్రభాకర్‌రావు కుమారుడు చైతన్యతో గతేడాది డిసెంబర్‌లో వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వీరి ఫోటో షూట్లు, ఇద్దరి మధ్య  ప్రేమానుబంధాన్ని పంచుకునే ప్రతి సన్నివేశం, సంఘటనలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్