ఓటీటిలో 'వివాహ భోజనంబు': ట్రైలర్ ఇదిగో

By Surya PrakashFirst Published Aug 5, 2021, 10:17 AM IST
Highlights

 టాలీవుడ్ ఫస్ట్ లాక్‌డౌన్ వెడ్డింగ్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. పిసినారి సత్య పెళ్లి చేసుకోగానే లాక్‌డౌన్ ప్రకటించడం, బంధువులతో నిండిపోయిన ఇంట్లో కొత్త జంటకు ప్రైవసీ దొరక్క ఇబ్బంది పడడం,సత్య పీనాసితనం వంటి అంశాలు హైలెట్‌గా ఈ మూవీ తెరకెక్కింది.

సత్య హీరోగా నటించిన సినిమా 'వివాహ భోజనంబు'. అర్జావీ రాజ్ హీరోయిన్. నిర్మాణ సంస్థలు ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కె.ఎస్. శినీష్, సందీప్ కిషన్ చిత్రాన్ని నిర్మించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. నెల్లూరు ప్రభ అనే ప్రత్యేక పాత్రలో ప్రముఖ యువ హీరో సందీప్ కిషన్ నటించారు. ఈ సినిమా టీజర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా ట్రైలర్ సైతం రిలీజైంది..ఓటీటి లోనే రిలీజ్ అని ఖరారు చేసారు. తెలుగులోకి కొత్తగా అడుగుపెట్టిన సోనీ లైవ్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవుతోంది.  హీరో సందీప్ కిషన్ నిర్మించిన ఓ ప్రత్యేక పాత్రలో కనిపించడం విశేషం. త్వరలో స్ట్రీమింగ్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు. 

  కరోనా నేపథ్యంలో పెళ్లి చేసుకున్న ఓ యువకుడి కథతో రూపొందిన ఈ వినోదాత్మక చిత్రంలో వినోదాల విందుకు ఏమాత్రం లోటు లేదని ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. వాస్తవ సంఘటనల ప్రేరణతో సినిమాను తెరకెక్కించమని  ట్రైలర్ లో టీమ్ పేర్కొంది. ఇందులో హీరో సత్య పిసినారిగా కనిపించాడు. అతని పెళ్లి అయ్యాక ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటిస్తుంది. పెళ్లికి విచ్చేసిన బంధువులంతా హీరో ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. వాళ్లని తన మీద పడి తినేయకుండా కంట్రోలు  చేసే క్రమంలో హీరో సత్య ఫన్ చేసారు. నెయ్యి ఎక్కువగా వాడొద్దు.. శానిటైజర్ అంత రాసేసుకుంటున్నారేటి..  అంటూ సత్య ఇంట్లో ఉన్న బంధువులను రాబందుల్లా చూస్తూంటాడు.  ఆ ట్రైలర్ మీరూ చూడండి.

అసలు కథ విషయానికి వస్తే... పది రూపాయలు పార్కింగ్ టికెట్ కొనడానికి, స్నేహితులకు పుట్టినరోజు పార్టీ ఇవ్వడానికి ఇష్టపడని ఓ పిసినారి మహేష్ (సత్య). కరోనా పుణ్యమా అని లాక్‌డౌన్ రావడంతో 30మందితో సింపుల్‌గా పెళ్లి తంతు కానిచ్చేస్తాడు. కానీ, ఆ తరవాత అసలు కథ మొదలవుతుంది. లాక్‌డౌన్ పొడిగించడంతో పిసినారి మహేష్ ఎన్ని కష్టాలు పడ్డాడనేది తెరపై చూడాలని చిత్ర టీమ్ చెబుతోంది.

 వెంకటాద్రి టాకీస్ సమర్పణలో ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై కె. ఎస్. శినీష్, సందీప్ కిషన్ సంయుక్తంగా నిర్మించిన ‘వివాహ భోజనంబు’లో సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, టి.ఎన్.ఆర్, ‘వైవా’ హర్ష, మధుమణి, నిత్యశ్రీ, కిరీటి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భాను భోగవరపు స్టోరీ అందించగా, నందు ఆర్. కె డైలాగ్స్ రాశారు. అనివీ సంగీతం సమకూర్చారు. మణికందన్ సినిమాటోగ్రఫీ అందించగా చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు.
 

click me!