ప్లీజ్ అలాంటి పనులు చేయొద్దు: రష్మిక రిక్వెస్ట్

Surya Prakash   | Asianet News
Published : Jun 28, 2021, 08:55 AM ISTUpdated : Jun 28, 2021, 08:57 AM IST
ప్లీజ్ అలాంటి పనులు చేయొద్దు: రష్మిక రిక్వెస్ట్

సారాంశం

రష్మిక తన ఫ్యాన్స్ కు ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేసింది. తనని చూసేందుకు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయొద్దని వేడుకుంటోంది. అది తనకు బాధ కలిగిస్తుందని చెప్తోంది రష్మిక.

“ఛలో” చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక మందన్న. ఆ తరువాత కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోకుండా దూసుకుపోయింది. ఆమె సినిమాలు వరసపెట్టి  బ్లాక్ బస్టర్ హిట్స్ కావడంతో హీరోలు,డైరక్టర్స్ అంతా ఆమెనే కోరుకుంటన్నారు.ఈ క్రమంలో ఆమె ప్రయాణం ఇప్పుడు సౌత్ నుంచి నార్త్ వైపు వెళ్తోంది. ఆఫర్స్ తో పాటు క్రేజ్ కూడా భారీగా పెరిగిపోయింది. తాజాగా ఆమె అభిమానుల్లో ఒకరు రష్మికను కలవడానికి పెద్ద సాహసమే చేశాడు.

రీసెంట్ గా తెలంగాణకు చెందిన ఆకాష్ త్రిపాఠి అనే అభిమాని రష్మిక మందన్నను కలవాలనే కోరికతో 900 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. అయితే అంతకుముందే అతను గూగుల్ లో రష్మిక చిరునామా కోసం సెర్చ్ చేశాడట. ఆ తరువాత ఆకాష్ తెలంగాణ నుండి మైసూర్ రైలులో, కొడగు జిల్లాలోని ముగ్లాకు ఆటో రిక్షాలో చేరుకున్నాడు. అయితే తీరా అక్కడికి వెళ్ళాక తన అభిమాన నటి అడ్రెస్ ను కనుక్కోలేకపోయాడు. 

దీంతో అక్కడే నివాసం ఉండే వ్యక్తులను అడిగి రష్మిక ఇంటి అడ్రెస్ కోసం ఆరా తీయడం మొదలెట్టాడట. దీంతో అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన కొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చారట. అక్కడి పోలీసులు ఆ వ్యక్తి వివరాలు కనుక్కుని, ఆమె ప్రస్తుతం కర్ణాటకలోని తన ఇంట్లో లేదని చెప్పి, తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని చెప్పారట. తన అభిమాన నటిని కలవాలని అభిలాషతో అంతదూరం ప్రయాణం చేసి వెళ్లిన అతనికి నిరాశ తప్పలేదు.
 
ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న రష్మిక తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ‘‘ఒక వీరాభిమాని నన్ను కలిసేందుకు చాలాదూరం ప్రయాణించి కర్ణాటకలోని మా ఇంటికి వెళ్లినట్లు నాకు ఇప్పుడే తెలిసింది. దయచేసి ఇలాంటి పనులు ఎవరూ చేయకండి. ఆ అభిమానిని కలవలేకపోయినందుకు చింతిస్తున్నాను. ఏదో ఒకరోజు కచ్చితంగా కలుస్తానన్న నమ్మకం ఉంది. ప్రస్తుతానికి మీ ప్రేమాభిమానాలు నాపై ఉంచండి. అప్పుడే నేను సంతోషంగా ఉంటా’’ అని అని రష్మిక పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌