అర్థనగ్న లుక్‌లో షాక్‌ ఇస్తున్న ` ఇందువ‌ద‌న` క్యారెక్టర్ పోస్టర్స్..

Published : Jun 27, 2021, 09:51 PM IST
అర్థనగ్న లుక్‌లో షాక్‌ ఇస్తున్న `  ఇందువ‌ద‌న` క్యారెక్టర్ పోస్టర్స్..

సారాంశం

తాజాగా విడుదలైన`ఇందువదన` ఫస్ట్ లుక్‌ చాలా కళాత్మకంగా ఉండటంతో అనూహ్యమైన స్పందన వస్తుంది. అందులో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ కథాపరంగా చాలా అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు. 

వరుణ్‌ సందేశ్‌, ఫర్నాజ్‌ శెట్టి జంటగా రూపొందుతున్న చిత్రం `ఇందువదన`.  శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై  ఎంఎస్‌ఆర్‌ దర్శకత్వంలో మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం `ఇందువదన`. చాలా రోజుల తర్వాత `ఇందువదన` సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్. తాజాగా విడుదలైన`ఇందువదన` ఫస్ట్ లుక్‌ చాలా కళాత్మకంగా ఉండటంతో అనూహ్యమైన స్పందన వస్తుంది. అందులో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ కథాపరంగా చాలా అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు. 

తాజాగా ఈ సినిమాలో వ‌రుణ్ సందేశ్ పోషిస్తున్న వాసు పాత్ర‌కి సంబంధించిన లుక్ విడుద‌లైంది. అలానే ఫ‌ర్నాజ్ శెట్టి పోషిస్తున్న ఇందు పాత్రకి సంబంధించిన లుక్ కూడా టీమ్ `ఇందువ‌ద‌న` విడుద‌ల చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ ఇటీవ‌లే పూర్తియింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. హైద‌రాబాద్ సార‌ధి స్టూడియోస్ లో భారీగా వేసిన సెట్స్ లో ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. ఈ సినిమాకు కథ, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు.  సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, బి మ‌ర‌ళికృష్ణ సినిమాటోగ్రాఫి బాధ్య‌త‌లు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు.

రఘు బాబు, అలీ, నాగినీడు, సురేఖ వాణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, మహేష్ విట్ట, పార్వతీషం, వంశీ కృష్ణ ఆకేటి, దువ్వాసి మోహన్, జ్యోతి, కృతిక (కార్తికదీపం ఫేమ్), అ౦బఋషి,
జెర్సీ మోహన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 
కో. ప్రొడ్యూసర్: గిరిధర్, 
కథ, మాటలు: సతీష్ ఆకేటి, 
కెమెరా: బి ముర‌ళి కృష్ణ‌
, సంగీతం: శివ కాకాని
, కో డైరెక్టర్: ఉదయ్ రాజ్
, ఎడిటర్: కోటగిరి
వెంకటేశ్వరరావు, 
ఆర్ట్: వై నాగు, 
లిరిక్స్: భాస్కరభట్ల, తిరుపతి జావన, 
లైన్ ప్రొడ్యూసర్స్: సూర్యతేజ ఉగ్గిరాల, వర్మ, 
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?