ఎలా చనిపోవాలో ముందుగానే రాసుకున్న వర్మ

By team teluguFirst Published Jun 28, 2021, 8:21 AM IST
Highlights

చావు అనేది తప్పని, తప్పుకోలేని విషయం కాబట్టి, చచ్చిపోతామేమో అని భయపడుతూ బ్రతకడం అనవసరం అంటాడు వర్మ. అలాగే తన చావు ఎలా ఉండాలో కూడా ఒక నిర్ణయానికి వచ్చాడు. 
 


ప్రతి ప్రశ్నకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దగ్గర ఒక ఆన్సర్ ఉంటుంది. విషయం ఏదైనా దాన్ని మరో కోణంలో చూడడం వర్మకు ఉన్న గొప్ప గుణం. అది సమాజం హర్షించేది కాకపోయినా వర్మ కేర్ చేయరు. అనిపించింది చెప్పడం, తోచింది చూపించడం వర్మలోనే చూడగలం. ఇక వర్మలా జీవించేవాడు బహుశా మన దేశంలో అయితే ఉండి ఉండడు, ప్రపంచంలో కూడా కష్టమే. 


పరిశ్రమలో ఉంటూనే పెద్ద పెద్ద హీరోలతో గొడవలు పెట్టుకుంటాడు. వాళ్ళ వ్యక్తిగత విషయాలు గెలుకుతాడు. అలాగే పొలిటీషియన్స్ ని కూడా వదలడు. వర్మ తత్త్వం, సిద్ధాంతం ఎవరికీ బోధపడదు. ఎందుకంటే దానికి నియమాలు, పద్ధతులు ఉండవు కాబట్టి. కొందరు పైశాచికంగా భావించే వర్మ మనోభావాలు, సోషల్ మీడియా ట్వీట్స్ సంచలనంగా మారుతూ ఉంటాయి. 


దేవుడు లేడు, అంతా ప్రాక్టికల్, బంధాలు, పాప పుణ్యాలు అంతా ట్రాష్ అని కొట్టిపడేసే వర్మ, చావుకు కూడా బయపడరట. చావు అనేది తప్పని, తప్పుకోలేని విషయం కాబట్టి, చచ్చిపోతామేమో అని భయపడుతూ బ్రతకడం అనవసరం అంటాడు. అలాగే తన చావు ఎలా ఉండాలో కూడా ఒక నిర్ణయానికి వచ్చాడు. 


అణుబాంబ్ పేలుడు దగ్గరగా చూడాలనేది వర్మ కోరిక అట. తప్పించుకోవడానికి అవకాశం లేదు, బాంబు మీద పడుతుంది అని తెలిసినప్పుడు దాని పేలుడును చూసి చనిపోతాడట. జీవితంలో అన్నీ చూసిన వర్మకు ప్రాక్టికల్ గా అణుబాంబు పేలుడు చూస్తూ మరణించాలనేది కోరిక అట. చావులో కూడా వర్మ తన మార్కు చూపించాడు కదా.. 
 

click me!