హీరో, హీరోయిన్ల లిప్ లాక్ సీన్.. సోషల్ మీడియాలో వైరల్!

Published : Jan 20, 2019, 02:51 PM IST
హీరో, హీరోయిన్ల లిప్ లాక్ సీన్.. సోషల్ మీడియాలో వైరల్!

సారాంశం

టాలీవుడ్ లో సక్సెస్ అయిన 'అర్జున్ రెడ్డి' సినిమాను హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో సినిమాను రీమేక్ చేస్తున్నారు. 

టాలీవుడ్ లో సక్సెస్ అయిన 'అర్జున్ రెడ్డి' సినిమాను హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో సినిమాను రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్, కియారా అద్వానీ నటిస్తోన్న ఈ సినిమాను ఒరిజినల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్నాడు. 

అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతుండడం మేకర్లకు షాక్ ఇస్తోంది. ఢిల్లీలో కిరోరీ మాల్ కాలేజ్ లో ఇటీవల సినిమా షూటింగ్ ని నిర్వహించారు. దీంతో అక్కడ స్టూడెంట్స్ కొంతమంది మొబైల్ లో సన్నివేశాలను చిత్రీకరించారు.

అలాగే షూటింగ్ స్పాట్ లో కొన్ని ఫోటోలు కూడా తీశారు. వీటిని ఇంటర్నెట్ లో పెట్టడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. హీరో, హీరోయిన్ల లిప్ లాక్ సీన్ బయటకొచ్చేసింది. దీంతో ఈ సినిమాపై ఇప్పుడు బజ్ క్రియేట్ అయింది. లిప్ లాక్ సీన్ చూసిన వారు షాహిద్, కియారాలు బోల్డ్ సన్నివేశాల్లో జీవించేసారని కామెంట్స్  చేస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today: బాలు పై బయటపడిన ప్రభావతి ప్రేమ, చిటికెలు వేసి మరీ శపథం చేసిన మీన
2025 Flop Movies: 100 కోట్లు దాటినా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌ అయిన 8 సినిమాలు