అతడిని దూరం చేసుకొని బాధ అనుభవిస్తోన్న పాయల్!

By Udayavani DhuliFirst Published 20, Jan 2019, 2:22 PM IST
Highlights

ప్రతి కుటుంబంలో కొన్ని బాధలు, కష్టాలు ఉంటాయి. వాటిని భరిస్తూనే కాలం గడుపుతుంటారు. ఇలాంటి ఓ కష్టం పాయల్ రాజ్ పుత్ కుటుంబంలో కూడా చోటుచేసుకుంది. 'RX 100' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమై తెలుగులో కాస్త పాపులారిటీ దక్కించుకుంది పాయల్. 

ఈరోజు పాయల్ తమ్ముడి పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. పాయల్ రాజ్ పుత్ సోదరుడు ధృవ్ రాజ్ పుత్ గత మూడు సంవత్సరాలుగా  కనిపించడం లేదట. 25 ఏళ్ల అతడు 2016 మార్చి నుండి కనిపించడం లేదని పేర్కొంటూ పాయల్ ట్విట్టర్ లో ఫోటోలను షేర్ చేసింది.

''నిన్ను చూడకుండా గడపడం చాలా కష్టంగా ఉంది. నువ్వు తిరిగి వస్తావని ఆశిస్తున్నాం. ఈరోజు నీ పుట్టినరోజు.. ఆ దేవుడు నీకు ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని  కోరుకుంటున్నాను. నువ్వు లేవని అమ్మానాన్న ఎంతో బాధ పడుతున్నారు. ఈ సందేశం నీకు అందుతుందని భావిస్తున్నాను. ఒకవేళ నువ్వు ఏదైనా ఆపదలో చిక్కుకొని ఉంటే మాకు ఫోన్ చెయ్.. నీ కోసం ఎదురుచూస్తున్నాం తమ్ముడు'' అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది. 

తన సోదరుడు తప్పిపోయిన విషయంపై  పాయల్ కంప్లైంట్ చేసినా.. పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని వెల్లడించింది. 

Last Updated 20, Jan 2019, 2:22 PM IST