బన్నీకి మూడు మిలియన్ల ఫాలోవర్లు!

By Udayavani DhuliFirst Published 20, Jan 2019, 1:13 PM IST
Highlights

ప్రస్తుతం సోషల్ మీడియా హవా సాగుతోన్న సంగతి తెలిసిందే. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వచ్చిన తరువాత సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం బాగా తగ్గింది. 

ప్రస్తుతం సోషల్ మీడియా హవా సాగుతోన్న సంగతి తెలిసిందే. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వచ్చిన తరువాత సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం బాగా తగ్గింది. చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.

వారిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. 2015లో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన బన్నీకి అప్పటినుండి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది. తాజాగా ఆయన ఫాలోవర్ల సంఖ్య మూడు మిలియన్లకు చేరుకుంది.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు బన్నీ. ''ట్విట్టర్ లో నన్ను ఫాలో ఆతున్న మూడు మిలియన్ల మందికి ధన్యవాదాలు. నాపై ఇంత ప్రేమ చూపిస్తున్న మీకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది. ఇది నా బలం కాదు.. మీ ఆశీర్వాదం ఉంది'' అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు బన్నీ.

ప్రస్తుతం బన్నీ.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా కావడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. 

Last Updated 20, Jan 2019, 1:13 PM IST