‘గర్వంగా చెబుతున్నా.. ఎస్.. నేను బైసెక్సువల్ నే’.. నటి మిషెల్లీ మార్కెజ్ సంచలన వ్యాఖ్యలు

By Asianet News  |  First Published May 31, 2023, 8:59 PM IST

ఫిలిప్పీన్స్ నటి, మోడల్ మిషెల్లీ మార్కెజ్ (Michelle Marquez Dee)  తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది. తనపై కొద్దిరోజులుగా వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం కామెంట్స్ హాట్ టాపిక్ గ్గా మారాయి.
 


ఫిలిప్పీన్స్ కు చెందిన యంగ్ బ్యూటీ మిషెల్లీ మార్కెజ్  నటి, మోడల్, టెలివిజన్ ప్రజెంట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2019లో మిస్ వరల్డ్ ఫిలిప్పీన్స్ లో విజేతగా నిలిచింది. అప్పటి నుంచి అందాల పోటీలో పాల్గొంటూనే వస్తోంది. విజేతగానూ నిలుస్తోంది. ఈ క్రమంలో 2023 మిస్ యూనివర్స్ ఫిలిప్పీన్స్ క్రౌన్ ను కూడా దక్కించుకుంది. దీంతో మిషెల్లీ పేరు అక్కడ మారుమోగుతోంది. ఈక్రమంలో మిషెల్లీ మార్కెజ్ పై ఓ రూమర్ కూడా ప్రచారంలో ఉంది. 
రీసెంట్ గా తన చిన్నప్పటి ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అందులో ఆమె అబ్బాయి పోలికలతో కనిపించింది. దీంతో ఆమె ‘గే’ అంటూ ప్రచారం జరిగింది. 
తన లైంగికత్వంపై కొద్దిరోజులుగా ఇలా వస్తున్న వార్తలపై తాజాగా స్పందించింది. క్లారిటీ ఇస్తూ వాటికి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా ఓ మ్యాగైజన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం మిషెల్లీ కామెంట్స్ వైరల్ గా మారాయి.  

మిషెల్లీ మాట్లాడుతూ.. ‘అవును నేను బై సెక్సువల్ నే.. నా 12 ఏళ్ల వయస్సులోనే ఈ విషయాన్ని గుర్తించాను. అన్ని రకాలా అందాలకు నేను అట్రాక్ట్ అవుతుంటాను. ఇదే విషయాన్ని మే13న నిర్వహించిన ఫిలిప్పీన్స్  బ్యూటీ కాంపిటీషన్ లోనే చెప్పాలని అనుకున్నా.. కానీ అది సందర్భంగా కాదని చెప్పలేకపోయాను. ఈ విషయం నాస్నేహితులకు కూడా తెలుసు. ఇప్పుడే అధికారికంగా ప్రకటిస్తున్నాను‘ అంటూ చెప్పుకొచ్చింది.  

Latest Videos

అలాగే తనకు ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని కూడా చెప్పింది. అంతేకాకుండా లింగత్వం మాత్రమే గుర్తింపు కాదని, నేను ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తినని గట్టిగా, గర్వంగా చెబుతున్నాను‘ అంటూ క్లారిటీ ఇచచింది. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తర్వలో ఎల్ సాల్వడార్ లో జరిగనున్న 72వ మిస్ యూనివర్స్ పోటీల్లో మిషెల్లీ ఫిలిప్పీన్స్ తరుపున పోటీపడనున్నారు. 
 

click me!