మహేశ్ బాబు ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న SSMB28 టైటిల్, గ్లింప్స్ ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. మహేశ్ బాబు మాస్ అవతార్ కి ఫ్యాన్స్ కు పూనకాలు ఖాయం.
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో పన్నెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం SSMB28. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పనులు చకాచకా జరుగుతోంది. ఈక్రమంలోనే యూనిట్ అదిరిపోయే అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైటిల్ ను రివీల్ చేశారు. అలాగే మహేశ్ బాబు మాస్ అవతార్ తో కూడిన పవర్ ఫుల్ గ్లింప్స్ ను విడుదల చేశారు.
కొద్ది రోజులుగా మహేశ్ బాబు- త్రివిక్రమ్ సినిమా టైటిల్ పై చర్చ జరుగుతూనే ఉంది. రకరకాల టైటిల్స్ వినిపించాయి. కానీ మేకర్స్ ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) టైటిల్ ను ఫైనల్ చేశారు. మహేశ్ బాబు మాస్ అవతార్ కు తగ్గట్టుగానే టైటిల్ ను ఎంపిక చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. దీంతో పాటు మాస్ స్ట్రైక్ పేరిట వదిలిన గ్లింప్స్ కు గూస్ బంప్స్ రావడం ఖాయం. మునుపెన్నడూ లేని విధంగా మహేశ్ బాబు ఊరమాస్ లుక్ లో కనిపిస్తున్నారు. యాక్షన్ తో అదరగొడుతున్నారు.
‘గుంటూరు కారం’ టైటిల్ కు తగ్గట్టుగానే మహేశ్ బాబు మాస్ అవతార్ కనిపిస్తోంది. గుంటూరు యాసలో మహేశ్ బాబు చెప్పిన ‘ఏంటీ అట్టా సూస్తున్నావ్.. బీడీ ఏమైనా త్రీడీలో కనిపిస్తుందా’ డైలాగ్ కిక్కిస్తోంది. ఇదే యాసలో మహేశ్ బాబు చెప్పబోయే డైలాగ్స్ మరింత ఆసక్తి నెలకొంది. యాక్షన్ పరంగా బాబు ఓ రేంజ్ లో ఉతికారేస్తున్నారు. అదే రేంజ్ లో థమన్ కూడా సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు థియేటర్లు బద్దలనే చెప్పాలి. ఇక అరగంటలోనే గ్లింప్స్ కు రెండు మిలియనల్ వ్యూస్ దక్కడం విశేషం. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.
ఫ్యాన్స్ కు మహేశ్ బాబును త్రివిక్రమ్ చాలా కొత్తగా చూపించబోతున్నారు. ఇక ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) నటిస్తోంది. మరో హీరోయిన్ గా శ్రీలీలా (Sreeleela) కూడా మెరియనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. 2024 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Presenting you the Highly Inflammable 🔥
▶️ https://t.co/HxmnoVf4jG ❤️ Super 🌟