ఈ నెల 25న పెళ్లి రోజు ఆడియో

Published : Sep 19, 2017, 01:42 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
ఈ నెల 25న పెళ్లి రోజు ఆడియో

సారాంశం

దినేష్, మియా జార్జ్ ,రిత్విక  లీడ్ రోల్ లో ‘పెళ్లి రోజు’ ఈ నెల 25న పెళ్లి రోజు ఆడియో ముఖ్య అతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య

సినియోగ్  మోషన్ పిక్చర్స్ పతాకంపై  దినేష్, మియా జార్జ్ ,రిత్విక  నటిస్తున్న చిత్రం ‘పెళ్లి రోజు’ ఈ సినిమా ఆడియో కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీన ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించనున్నారు. ఈ చిత్రానికి సురేష్ బల్లా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

 

నెల్సన్ వెంకటేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఆడియో కార్యక్రమానికి ముఖ్య అతిధి గా తమిళనాడు మాజీ  గవర్నర్ డాక్టర్ కె. రోశయ్య హాజరుకానున్నారు.  తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి  అధ్యక్షత వహిస్తుండగా.. ప్రత్యేక అతిధిగా అలనాటి నటి జమున హాజరుకానున్నారని నిర్మాత తెలిపారు.

 

శ్రీమతి జమున 1968లో పెళ్లిరోజు చిత్రంలో నటించారు . అందుకే మేము ఇప్పుడు ఆమెను ఆహ్వానిస్తున్నామని సురేష్ తెలిపారు. . పెళ్లిరోజు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన రోజని, అది అందరికీ మరపురాని రోజుగా మిగిలి పోతుందని మరో నిర్మాత మృదుల చెప్పారు. 

 

నేటి సమాజంలో పెళ్లి విషయంలో యువతి యువకులు ఎదుర్కొనే  సమస్యలకు ఇది ప్రతి బింబముగా ఉంటుందని ఆమె తెలిపారు. 

ఓక మంచి సందేశాత్మక చిత్రంగా దీనిని మలిచాము ఆమె అన్నారు . ఇప్పటికే ఈ సినిమా పట్ల పలువురు ఆసక్తి కనపరుస్తున్నారని , పాటలు కూడా చాలా అర్థ వంతంగా వుంటాయని చెప్పారు. 

 

దర్శకుడు  నెల్సన్ వెంకటేశం మాట్లాడుతూ , ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే  చిత్రమవుతుంది అన్నారు. .ఓక మంచి సినిమా తీశానని తృప్తి తనకు వున్నదని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి