యాంకర్ రేష్మి ఇక అంతేనా?

Published : Sep 19, 2017, 12:52 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
యాంకర్ రేష్మి ఇక అంతేనా?

సారాంశం

 గుంటూరు టాకీస్ సినిమాలో హాట్ రోల్ తో కుర్రకారును కవ్వించిన రష్మి తాజాగా ఈటీవీ ప్రభాకర్ దర్శకత్వంలో మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్న రష్మి నెక్స్ట్ నువ్వే అంటూ వస్తున్న ఈ మూవీలో రష్మి అందాలు కవ్విస్తాయట

జబర్దస్త్ పప్రోగ్రామ్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యాంకర్ రష్మి గుంటూర్ టాకీస్ తో ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చింది. సిల్వర్ స్క్రీన్ పై అమ్మడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. శృంగార ప్రియులను అలరించిన ఈ చిన్నది మళ్లీ యదా విధిగా తన షోలు తను చేసుకుంటూ అడపాదడపా సినిమాల్లో మెరుస్తుంది. గుంటూర్ టాకీస్ తో అలాంటి సినిమాలే వరుసగా చేయగా మొహం కొట్టేసిన ఆడియెన్స్ హెసిటేట్ చేశారు.

 

అందుకే కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న రష్మి ఇప్పుడు మళ్లీ రెచ్చిపోయేందుకు సిద్ధమైంది. ఆది సాయికుమార్ హీరోగా టివి నటుడు దర్శకుడు ప్రభాకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రష్మి ఓ స్పెషల్ రోల్ చేస్తుంది. ఇక మరోసారి గుంటూర్ టాకీస్ రష్మిని చూసిన భావన కలుగుతుంది. డౌటు లేకుండా రష్మి ఈ సినిమాతో మళ్లీ తన హాట్ ఇమేజ్ ను వాడేసుకుని క్రేజ్ సంపాదించాలని చూస్తుంది. అయితే రశ్మి కేవలం ఇలాంటి పాత్రలకే అంకితమయ్యిందా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.  

 

యామిరుక్కు భయమే అనే తమిళ సినిమా రీమేక్ గా వస్తున్న ఈ సినిమా గీతా ఆర్ట్స్-2, యువి క్రియేషన్స్ వారు కలిసి వి4 క్రియేషన్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. వైభవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో ఆది ఈసారి హిట్ కొట్టడం పక్కా అనేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. 

 

శమంతకమణి తర్వాత ఆది చేస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమా సస్పెన్స్, హర్రర్ నేపథ్యంతో సాగినట్టు తెలుస్తుంది. సినిమాలో ఓ పక్క నవ్విస్తూ భయపెడుతూ రష్మి అందాలు కూడా అలరిస్తాయని అంటున్నారు. మరి రష్మి సహకారంతో ఆది ఈ సినిమాను తన హిట్ ఖాతాలో పడేలా చేసుకుంటాడో లేదో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి