పాయల్ రొమాన్స్ కేవలం వాళ్లతోనేనా..?

Published : May 15, 2019, 02:47 PM IST
పాయల్ రొమాన్స్ కేవలం వాళ్లతోనేనా..?

సారాంశం

'ఆర్ ఎక్స్ 100' లాంటి యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పుత్ కి హిట్ అందుకున్నా సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. 

'ఆర్ ఎక్స్ 100' లాంటి యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పుత్ కి హిట్ అందుకున్నా సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. ఆ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ లో అందాలు ఆరబోసిన ఈ బ్యూటీకి యువ హీరోల సరసన వరుస అవకాశాలు వస్తాయని భావించారు. 

కానీ అలా జరగడం లేదు. కేవలం సీనియర్ హీరోల సినిమాల కోసం మాత్రమే పాయల్ ని సంప్రదిస్తున్నారు. ఇటీవల 'వెంకీ మామ' సినిమాలో వెంకీ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. అలానే రవితేజ నటిస్తోన్న 'డిస్కో రాజా'లో హీరోయిన్ గా ఈమెనే తీసుకున్నారు.

నిజానికి నాగార్జున 'మన్మధుడు 2' సినిమాలో మొదట హీరోయిన్ గా పాయల్ ని అనుకున్నారు. కానీ రకుల్ డేట్స్ ఇవ్వడంతో పాయల్ ని పక్కన పెట్టేశారు. తాజాగా బాలకృష్ణ, కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందనున్నా సినిమాలో పాయల్ ని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. ఇందులో మరో హీరోయిన్ కూడా ఉంటుందని సమాచారం.

అలా కేవలం సీనియర్ హీరోల సరసన మాత్రమే పాయల్ కి అవకాశాలు వస్తున్నాయి. నాని, నితిన్ లాంటి యువ హీరోలు ఆమె వైపు ఎంత మాత్రం చూడడం లేదు. యువ హీరోలు అవకాశాలు ఇవ్వకపోవడంతో వచ్చిన అవకాశాలను చేసుకుంటూ కెరీర్ లో ముందుకు వెళ్తోంది!

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్