ఫ్యాన్స్ కోసం 60వ సినిమా.. యువ దర్శకుడికి స్టార్ హీరో బంపర్ అఫర్

Published : May 15, 2019, 02:43 PM ISTUpdated : May 15, 2019, 02:48 PM IST
ఫ్యాన్స్ కోసం 60వ సినిమా.. యువ దర్శకుడికి స్టార్ హీరో బంపర్ అఫర్

సారాంశం

  100కోట్ల మార్కెట్ తో నిత్యం సౌత్ స్టార్ హీరోలకు పోటీనిచ్చే కథానాయకుడు అజిత్. సినిమా సినిమాకు అభిమానుల సంఖ్యను పెంచుకుంటూ వెళుతోన్న ఈ స్టార్ హీరో ఒక టెక్నీషియన్ ని నమ్మితే అస్సలు వదలడు.

100కోట్ల మార్కెట్ తో నిత్యం సౌత్ స్టార్ హీరోలకు పోటీనిచ్చే కథానాయకుడు అజిత్. సినిమా సినిమాకు అభిమానుల సంఖ్యను పెంచుకుంటూ వెళుతోన్న ఈ స్టార్ హీరో ఒక టెక్నీషియన్ ని నమ్మితే అస్సలు వదలడు.గతంలో దర్శకుడు శివతో వరుసగా నాలుగు సినిమాలను వెంట వేంటనే ఒకే చేసిన సంగతి తెలిసిందే. 

 వీరమ్ - వేదాలమ్ - విశ్వాసం అంటూ  బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు షూటింగ్ దశలో ఉండగానే మరో యువ దర్శకుడికి బంపర్ అఫర్ ఇచ్చాడు ఈ సీనియర్ హీరో. కార్తీ 'ఖాకి'  సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న H.వినోథ్ ప్రస్తుతం అజిత్ 59వ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ పింక్ సినిమాకు ఇది రీమేక్.

అయితే దర్శకుడి మేకింగ్ పై అజిత్ కన్ను పడింది. షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే వినోథ్ కి మరో అవకాశం ఇస్తున్నట్లు చెప్పేశాడు. నా అభిమానులను దృష్టిలో పెట్టుకొని నీ స్టైల్ లో ఒక మంచి కథను సెట్ చేస్కో..  ఈ ప్రాజెక్ట్ అయిపోగానే కొత్త సినిమాను మొదలెడదామని అజిత్ తన 60వ సినిమాకు శ్రీకారం చుట్టేశాడు. మరి దర్శకుడు వినోథ్ అజిత్ కి ఎలాంటి విజయాల్ని అందిస్తాడో చూడాలి.    

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్