బోయపాటికి హీరోలు దొరకక..!

Published : May 15, 2019, 02:36 PM IST
బోయపాటికి హీరోలు దొరకక..!

సారాంశం

ఒకప్పుడు దర్శకుడు బోయపాటి సినిమాలంటే మాస్ ఆడియన్స్ లో క్రేజ్  ఉండేది. హీరోలు కూడా మాస్ సినిమాలంటే బోయపాటి డైరెక్షన్ లో  పని చేయడానికి ఇష్టపడేవారు.

ఒకప్పుడు దర్శకుడు బోయపాటి సినిమాలంటే మాస్ ఆడియన్స్ లో క్రేజ్ ఉండేది. హీరోలు కూడా మాస్ సినిమాలంటే బోయపాటి డైరెక్షన్ లో పని చేయడానికి ఇష్టపడేవారు. ఆ స్థాయి నుండి ఈరోజు బోయపాటితో సినిమా అంటే భయపడే స్థాయికి వచ్చేశారు. దానికి కారణం 'వినయ విధేయ రామ'. ఈ సినిమా ఎఫెక్ట్ బోయపాటిపై మాములుగా పడలేదు. ఘోర పరాజయాన్ని తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా తన ప్రతిష్టని కూడా పాడుచేసుకున్నాడు. 

దీంతో ఇప్పుడు అతడితో సినిమాలు చేయడానికి ఏ హీరో ముందుకు రావడం లేదు. కనీసం కథ చెప్పడానికి అప్పాయింట్మెంట్ కూడా ఎవరూ ఇవ్వడం లేదు. ఆఖరి బాలకృష్ణ కూడా మరో ప్రాజెక్ట్ చేసుకుంటున్నాడు కానీ బోయపాటికి డేట్స్ ఇవ్వడం లేదు. ఇక యువ హీరోలెవరూ కూడా బోయపాటితో కలిసి వర్క్ చేయడానికి సిద్ధంగా లేరు. యువ హీరోలు 
కూడా తనపై ఆసక్తిగా లేరని తెలుసుకున్న బోయపాటి ఆలోచనలో పడ్డాడు. 'RX 100' చిత్రంతో సక్సెస్ అందుకున్న నటుడు కార్తికేయతో సినిమా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాడు.

అతడితో మరో కమర్షియల్ సినిమా తీసి సక్సెస్ కొట్టాలని భావిస్తున్నాడు. పైగా కార్తికేయకి సొంత బ్యానర్ కూడా ఉండడంతో నిర్మాతని వెతుక్కోవాల్సిన పని ఉండదు. కానీ బోయపాటిని కార్తికేయ తట్టుకోగలడా..? లేదా..? అనేది చూడాలి!

PREV
click me!

Recommended Stories

The RajaSaab బాక్సాఫీసు టార్గెట్‌ ఇదే, ప్రభాస్‌ రేంజ్‌ ఇలా ఉంటది.. ఏమాత్రం తేడా కొట్టినా మునిగిపోవాల్సిందే
'అప్పుడు బిగ్ బాస్ చేసిన పనికి ఆశ్చర్యపోయా.. గిఫ్ట్‌గా లిప్‌స్టిక్‌లు పంపించాడు..'