17ఏళ్ల ఆ చేదు జ్ఞాపకాన్ని పవన్ ఇంకా దాచుకున్నాడా! ?

By team teluguFirst Published Feb 3, 2021, 3:58 PM IST
Highlights

అయ్యప్పనుమ్ కోశియుమ్ సెట్స్ లో కుర్చీలో కూర్చొని ఉన్న పవన్ కళ్యాణ్ జాని అని పేరు రాసున్న కర్చీఫ్ చేతికి చుట్టుకొని కనిపించారు. దీనితో 13ఏళ్ల జాని సినిమా జ్ఞాపకాన్ని పవన్ ఇంకా దాచి పెట్టుకున్నాడా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. 

పవన్ కళ్యాణ్ కెరీర్ లో అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది జాని మూవీ. పవన్ స్వీయ దర్శకత్వంలో, స్వయంగా రాసుకున్న కథతో పవన్ జాని చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత పవన్ నుండి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఆకాశానికి చేరాయి. పవన్ వీరాభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ఆ మూవీ, విడుదల తరువాత పూర్తి నిరాశకు గురిచేసింది. పవన్ నుండి ఫ్యాన్స్ ఆశించిన ఎలిమెంట్స్ ఏవి కూడా ఆ మూవీలో లేవు. 

దానికి తోడు బక్క పలుచని పవన్ కళ్యాణ్ లుక్ కూడా విమర్శల పాలైంది. కాగా ఈ మూవీలో పవన్ జాని అనే పేరు రాసి ఉన్న కర్చీఫ్ తలకు, కాలికి కట్టుకుంటారు. అప్పట్లో అదో ట్రెండ్ అని చెప్పాలి. ఆయన ఫ్యాన్స్ కూడా కాలికి, తలకు అలాంటి కర్చీపే కట్టుకుని తిరిగేవారు. కాగా జాని మూవీ పవన్ కి చేదు అనుభవం మిగల్చగా, ఆ సినిమాలో తలకు కట్టుకున్న కర్చీఫ్ పవన్ ఇంకా దాచుకున్నట్లు ఉన్నాడు. 

అయ్యప్పనుమ్ కోశియుమ్ సెట్స్ లో కుర్చీలో కూర్చొని ఉన్న పవన్ కళ్యాణ్  జాని అని పేరు రాసున్న కర్చీఫ్ చేతికి చుట్టుకొని కనిపించారు. దీనితో 13ఏళ్ల జాని సినిమా జ్ఞాపకాన్ని పవన్ ఇంకా దాచి పెట్టుకున్నాడా అని కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే అది ఫ్యాన్ ఎడిట్ అని, ఒరిజినల్ ఫొటోలో కర్చీఫ్ పై జాని అనే పేరు లేదని కొందరు అంటున్నారు. నిజం ఏదైనా కానీ ప్రస్తుత ఫోటో వైరల్ అవుతుండగా... సోషల్ మీడియాలో పెద్ద చర్చకు తెరలేచింది. 
 

click me!