వివాదాస్పద బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ కరోనాతో కన్నుమూత

Published : Feb 03, 2021, 03:44 PM IST
వివాదాస్పద బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ కరోనాతో కన్నుమూత

సారాంశం

వివాదాస్పద బిగ్‌బాస్‌ 10 కంటెస్టెంట్‌ స్వామి ఓం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడిన ఆయన ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ రోజు ఉదయం కన్నుమూసినట్టు అతని కుమారుడు అర్జున్‌ జైన్ వెల్లడించారు.

వివాదాస్పద బిగ్‌బాస్‌ 10 కంటెస్టెంట్‌ స్వామి ఓం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడిన ఆయన ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ రోజు ఉదయం కన్నుమూసినట్టు అతని కుమారుడు అర్జున్‌ జైన్ వెల్లడించారు. ఢిల్లీలోని నిగమ్‌ బోధ్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించినట్టు చెప్పారు. 

ఇదిలా ఉంటే స్వామి ఓం తనని తాను దేవుడిగా ప్రకటించకుని, రాజకీయ నాయకుడిగా చలామణి అయ్యారు స్వామి ఓం. ఆయన 2017లో హిందీలో ప్రసారమైన బిగ్‌బాస్‌ 10లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. తోటి కంటెస్టెంట్లపై మూత్ర విసర్జన చేసి వివాదాస్పదంగా మారాడు. ఆ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారడం, అతని చేష్టలు తోటివారిని ఇబ్బంది పెట్టేలా ఉండటంతో విసిగిపోయిన హోస్ట్ సల్మాన్‌ ఆయన్ని హౌజ్‌ నుంచి బహిష్కరించాడు. 

అనంతరం ఆయన సల్మాన్‌పై అనేక ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారు. బిగ్‌బాస్‌ యాజమాన్యంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు ఇతర అనేక విషయాల్లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హాట్‌ టాపిక్‌గా మారాడు. అంతేకాదు తనని తాను దేవుడిగా ప్రకటించుకుని షాక్‌ ఇచ్చాడు. గతంలో ఓ కేసులో అరెస్ట్ కూడా అయ్యాడు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

సినిమాల్లోకి రాక‌ముందు.. ఈ హీరోయిన్ల పేర్లు ఏంటో తెలుసా.?
Mahesh Babu: మహేష్ బాబు నటిస్తూ నిజంగానే ఏడ్చేసిన సన్నివేశం, సినిమా ఏదో తెలుసా?