చిరంజీవి వల్లే 8 వేల మంది ప్రాణాలు కాపాడాం

By Surya PrakashFirst Published Feb 3, 2021, 3:50 PM IST
Highlights


కేవలం ఓ నటుడు గానే కాకుండా మానవతవాదిగానూ  మెగాస్టార్ చిరంజీవికు పేరుంది. ఎవరైనా కష్టాల్లో ఉన్న ఆప‌ద‌లో ఉన్న సరే వారికి త‌నవంతు సాయం అందిస్తుంటారు చిరు. ఇప్పటికే అయన బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ లను ఏర్పాటు చేసి చాలా సేవలని అందిస్తున్నారు. 

అలాగే చిరంజీవి క‌రోనా రోగుల‌కు ఉచితంగా ప్లాస్మా విత‌ర‌ణ చేయాల‌ని నిర్ణయం తీసుకుని సక్సెస్ అయ్యారు. కరోనా బారిన పది నిస్సహాయులైన పేద రోగులకు ఉచిత ప్లాస్మా ను తన బ్లడ్ బ్యాంకు ద్వారా వితరణ చేసారు చిరు.

 అంతేకాకుండా కరోనా లాక్‌డౌన్ సమయంలో సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా ప్లాస్మా డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయం గుర్తు చేసుకున్నారు సజ్జనారు. చిరంజీవి ఇచ్చిన స్పూర్తి వల్ల దాదాపు 8 వేల మంది ప్లాస్మా డొనేషన్ చేశారు అని సజ్జనార్ చెప్పారు.

సజ్జనార్ మాట్లాడుతూ...ప్లాస్మా డొనేషన్ కారణంగా దాదాపు 8 వేల మంది ప్రాణాలను కాపాడాం. దానికి సంబంధించిన క్రెడిట్ అంతా చిరంజీవికే దక్కుతుంది. చిరంజీవి ఇచ్చిన పిలుపు వల్ల అత్యధిక మంది ప్లాస్మా డొనేషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవికి సైబరాబాద్ పోలీసులు, సైబారాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తరఫున ధన్యవాదాలు తెలుపుకొంటున్నాం అని పోలీస్ కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు.
 
కొద్ది నెలల క్రితం సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ ఏర్పాటు చేసిన ప్లాస్మా డొనేషన్ కార్యక్రమంలో చిరంజీవి అతిథిగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా స్పూర్తి దాయకమైన సందేశాన్ని ఇవ్వాలని పోలీస్ కమిషనర్ సజ్జనార్ కోరిక మేరకు చిరంజీవి ఆ క్యాంపుకు హాజరయ్యారు. కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేస్తే మరికొందరి ప్రాణం పోసినవాళ్లమవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, సజ్జనార్ ఆహ్లాదకరంగా మాట్లాడుతూ క్యాంపుకు హాజరైన, ప్లాస్మా దాతలకు నవ్వుల్లో ముంచెత్తడం తెలిసిందే.
 

click me!