‘ఉస్తాద్ భగత్ సింగ్’ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రిఫరెన్స్ తో ..

Published : Apr 26, 2023, 04:24 PM IST
‘ఉస్తాద్ భగత్ సింగ్’ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రిఫరెన్స్ తో ..

సారాంశం

 ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్‌ కల్యాణ్‌- హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ రెండో చిత్రం ఇదే. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.


 ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్.... హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అని అనౌన్స్ చేసి షూటింగ్ మొదలెట్టిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం ఎడిటింగ్ కూడా మొదలైనట్లు మైత్రీ మూవీస్ వారు అప్డేట్ ఇచ్చారు. మనల్ని ఎవడ్రా ఆపేది అనే క్యాప్షన్ తో రాబోతున్న ఈ ఎంటర్టైన్మెంట్ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ కు రంగం సిద్దమైనట్లు సమాచారం. మే 11 న  ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేయానికి సమయం ఫిక్స్ చేసినట్లు వినిపిస్తోంది.  హరీష్, పవన్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ 11 వ ఏనవర్శరీ సందర్బంగా ఈ గ్లాంప్స్ ని వదలబోతున్నట్లు తెలుసోతంది. గబ్బర్ సింగ్ రిఫరెన్స్ కూడా ఈ గ్లింప్స్ లో ఉండబోతోందిట.

ఇదిలా ఉంటే ఈ చిత్రం తేరి రీమేక్..అవునా కాదో అనే మ్యాటర్ మాత్రం తేలటం లేదు.   ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇవ్వనున్నాడు.  అయితే ఈ  చిత్రం కథ కు సభందించిన ఓఅంశం బయిటకు వచ్చింది. ఈ సినిమా  పూర్తి స్థాయి రీమేక్ కాకుండా  ఇటు ఒరిజినల్ కాకుండా సరికొత్త మార్పులతో  రానున్నదని తెలుస్తోంది. తేరి చిత్రానికి, ‘భవదీయుడు భగత్ సింగ్’స్క్రిప్టు ఫస్టాఫ్ కలిపి  ఈ స్క్రిప్టు రెడీ చేసారని తెలుస్తోంది. ఈ స్క్రిప్టు సరికొత్తగా ఉందని, తేరిలోని ఎమోషన్ ని, కొన్ని యాక్షన్ బ్లాక్స్ మాత్రమే ఈ కథలో ఉపయోగించబోతున్నట్లు సమాచారం.

అలాగే  తేరీ లో  విజయ్ చేసిన బేకరీ ఓనర్ క్యారెక్టర్ ని హరీష్ సొంతగా రాసుకున్న  ‘భవదీయుడు భగత్ సింగ్’స్క్రిప్టు  లోని కాలేజీ లెక్చరర్ రోల్ తో రీప్లేస్ చేస్తున్నారు. దాంతో ఫస్టాఫ్ ఫన్ తో కొద్ది పాటి యాక్షన్ తో నిండి ఉంటుందని, సెకండాఫ్ మాత్రం పూర్తిగా థేరి లా సాగుతుందని చెప్తున్నారు. అయితే సెకండాఫ్ లోనూ హరీష్ శంకర్ స్టైల్ లో మార్పులు, చేర్పులు ఉండబోతున్నట్లు చెప్తున్నారు. గబ్బర్ సింగ్ తరహాలో ఈ చిత్రం భారీగా వర్కవుట్ అవుతుందని చెప్తున్నారు. అందుకే ‘భవదీయుడు భగత్ సింగ్’ లో భగత్ సింగ్ ని తీసుకుని పోలీస్ లోని యాక్షన్ ని గుర్తు చేసేలా  ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పెట్టారని వినిపిస్తోంది. 

ఈ చిత్రానికి ‘మనల్ని ఎవడ్రా ఆపేది...’ అనే ట్యాగ్‌లైన్‌. అంతేకాకుండా.. ‘ఈ సారి కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు’ అని పోస్టర్ మీద రాసుకొచ్చారు. ఆ పోస్ట్‌కి ‘పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్‌ కల్యాణ్‌- హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ రెండో చిత్రం ఇదే. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఓ వైపు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే.. వరుస సినిమాలలో సినీ కెరీర్‌లోనూ దూసుకెళుతున్నారు. ఆయన ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ చేస్తున్నారు. ఇటీవలే ‘సాహో’ దర్శకుడు సుజీత్ (Sahoo Sujeeth) కాంబినేషన్‌లో సినిమా ప్రారంభమై షూటింగ్ జరుగుతోంది.
 
  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?
Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?