తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాగార్జున-అమల, అఖిల్ ఏజెంట్ రిలీజ్ అవుతుండటంతో..?

Published : Apr 26, 2023, 04:10 PM IST
తిరుమల శ్రీవారిని  దర్శించుకున్న నాగార్జున-అమల, అఖిల్ ఏజెంట్ రిలీజ్ అవుతుండటంతో..?

సారాంశం

అక్కినేని దంపతులు నాగార్జున, అమల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చాలా కాలం తరువాత వారు తిరుమల సందర్శనకు రావడం విశేషంగా మారింది. తనయుల కోసమే వారు వెంకన్నను దర్శంచుకున్నట్టు తెలుస్తోంది.   


దైవ దర్శనాలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు అక్కినేని నాగార్జున ఆయన తాజగా భార్య అమలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చాలా కాలం తరువాత వారు వెంకటేశ్వర స్వామిదర్శనానికి రావడం విశేషంగా మారింది. అయితే వీరు తమ పిల్లల మొక్కు కోసం ఇలా తిరుమల వచ్చినట్టు తెలుస్తోంది. ఎంత ప్రయత్నం చేసినా.. నాగ్ ఇద్దరు తనయులకు ఫిల్మ్ కెరీర్ పెద్దగా కలిసి రావడం లేదు. దాంతో వారి పిల్లల భవిష్యత్తు కోసం వారు దైవ దర్శనం చేసుకున్నట్టు తెలుస్తోంది. 

తాజాగా అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్  సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.  ఈనెల 28న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవ్వబోతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈసినిమాను  అనిల్ సుంకర తెరకెక్కించారు. బాలీవుడ్ నటుడు డినో మోరియా నెగెటివ్ రోల్ పోషించాడు. భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో తెరకెక్కిన ఈమూవీ కోసం రెండేళ్లుగా అఖిల్ బాగా కష్టపడ్డాడు. సిక్స్ ప్యాక్ తో రెండేళ్లు మెయిటేన్ చేస్తూ.. షూటింగ్ కంప్లీట్ చేశాడే. దాంతో ఈసినిమాపై  అంచనాలు భారీగానే ఉన్నాయి. అఖిల్ కూడా ఈ సినిమా తనకు మంచి హిట్ ఇస్తుందనే ఆశల్లో ఉన్నాడు. ఈ సినిమా కోసం అఖిల్ దాదాపు రెండు సంవత్సరాలు కష్టపడ్డాడు. 

మరోవైపు తమ కుమారుడు అఖిల్ సినిమా రిలీజ్ నేపథ్యంలో ఈరోజు నాగార్జున, అమల తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తమ కొడుకుల కోసం ఇలా దైవ దర్శనం చేసుకున్నట్టు వారు తెలిపారు. ఇక ఏజంట్ సినిమాలో  మలయాళం సూపర్ స్టార్ మమ్మూట్టి ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. ఇందు అఖిల్ సరసన హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తోంది. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Actor Sreenivasan: ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత.. 48 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు
Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?