‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ గ్లింప్స్ అప్డేట్.. ఆ థియేటర్ లో గ్రాండ్ లాంచింగ్ కు ఏర్పాట్లు..

By Asianet News  |  First Published May 9, 2023, 6:56 PM IST

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కు సంబంధించిన డేట్ ను రీసెంట్ గా ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా టైమ్, ప్లేస్ ను కూడా అనౌన్స్ చేస్తూ యూనిట్ అప్డేట్ అందించింది. 
 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అప్డేట్ గురించి ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. పదేండ్ల తర్వాత Pawan Kalyan - హరీశ్ శంకర్ కాంబో సెట్ అవడం.. సినిమా కూడా పట్టాలెక్కి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఫస్ట్ అప్డేట్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. సినిమా ప్రారంభం నుంచి బ్యాక్ టు బ్యాక్ ఎగ్జైటింగ్ న్యూస్ అందిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా ఫస్ట్ గ్లింప్స్ ను మే11న విడుదల చేబోతున్నట్టు అప్డేట్ అందించారు. 

తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను కూడా అందించారు. అప్పుడు డేట్ ఫిక్స్ చేస్తూ అప్డేట్ ఇవ్వగా.. తాజాగా టైమ్, ప్లేస్ ను అనౌన్స్ చేశారు.  మే 11న సాయంత్రం 4:59 గంటలకు విడుదల చేశాయనున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 35ఎంఎం థియేటర్ లో గ్రాండ్ లాంచింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ ఈ అప్డేట్ గురించే ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా చిత్రంలోని డైలాగ్స్, మ్యూజిక్ పై ఆసక్తి నెలకొంది. 

Latest Videos

పదేండ్ల కింద పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్ - దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. దీంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలు ఉన్నాయి. దేవీ శ్రీప్రసాద్ ఇప్పటికే మ్యూజిక్ పై ప్రామిసింగ్ కామెంట్స్ చేశారు. ఈక్రమంలో ఫస్ట్ గ్లింప్స్ ఏ స్థాయిలో ఉండనుందో చూడాలి. 

Harish Shankar కూడా షూటింగ్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఓవైపు  షూటింగ్, మరోవైపు ఎడిటింగ్, మ్యూజిక్ వర్క్ ప్రారంభించి స్పీడ్ పెంచారు. పవన్ ఇచ్చిన కాల్ షీట్లను సరిగ్గా వినియోగించుకుంటూ బెస్ట్ అవుట్ పుల్ అందించేందుకు క్రుషి చేస్తున్నారు. త్వరలో రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం  కానుంది. ఇప్పటికే ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, సినిమాటోగ్రాఫర్ లోకేషన్స్ సర్చింగ్ లో ఉన్నారు. యంగ్ హీరోయిన్ శ్రీలీలా (Sreeleela) హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. 2024లో రిలీజ్ కానుంది. 

Get ready for the power packed frenzy on the special day 🔥 First Glimpse MASSive Launch at SANDHYA 35MM, Hyderabad on May 11th at 4.59 PM💥 🔥 pic.twitter.com/S9OqQSWnMf

— Mythri Movie Makers (@MythriOfficial)
click me!