విజయ్‌ దేవరకొండ కొత్త సినిమాల అప్‌డేట్లు.. నెవర్‌ బిఫోర్‌ అవతార్.. వైరల్‌

Published : May 09, 2023, 05:37 PM IST
విజయ్‌ దేవరకొండ కొత్త సినిమాల అప్‌డేట్లు.. నెవర్‌ బిఫోర్‌ అవతార్.. వైరల్‌

సారాంశం

నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న విజయ్‌ దేవరకొండ తన అభిమానులకు బ్యాక్‌ టూ బ్యాక్‌ అప్‌డేట్లతో సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. తాజాగా కొత్త సినిమాల అప్‌డేట్లు వచ్చాయి.   

విజయ్‌ దేవరకొండ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ని వరుసగా సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. ఇప్పటికే `ఖుషి` చిత్రం నుంచి తొలి పాటని విడుదల చేశారు. సమంత, విజయ్ ల మధ్య వచ్చే ఆ ప్రేమ గీతం ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీంతోపాటు కొత్త సినిమాల అప్‌డేట్లు ఇచ్చారు. ఇందులో ఒకటి అత్యంత క్రేజీగా, ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. విజయ్‌ దేవరకొండ నెవర్‌ బిఫోర్‌ అనేలా కనిపిస్తుంది. అదే గౌతమ్‌ తిన్ననూరి ఫిల్మ్. శ్రీలీలా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై శ్రీకర స్టూడియో సమర్పణలో ఎస్‌ నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. 

`వీడీ12` వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా మే 3న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం నుంచి ప్రత్యేక పోస్టర్‌ని విడుదల చేశారు. పోస్టర్‌ చాలా క్రియేటివ్‌గా ఉంది. ఆసక్తిని రేకెత్తిస్తుంది. నేడు(మే 9) విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ లో పియానోని తలపిస్తూ పేర్చిన కాగితపు ముక్కలపై విజయ్‌ ఫేస్‌ కనిపించడం విశేషం. హీరో కళ్ళలో ఇంటెన్స్ కనిపిస్తోంది. అలాగే పోస్టర్ పై "I don't know where I belong, to tell you whom I betrayed - Anonymous Spy" అని రాసుంది. `నేను ఎవరికి ద్రోహం చేశానో చెప్పడానికి నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియదు, అనామక గూఢచారి` అని ఈ పోస్టర్‌ ఆకట్టుకుంటుంది. ఇందులో విజయ్‌ స్పైగా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. 

గతంలో గౌతమ్ తిన్ననూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ 'జెర్సీ' చిత్రం కోసం జతకట్టారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టి ఘన విజయం సాధించింది. 'జెర్సీ' సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. ఇప్పుడు ఈ ప్రతిభకు, అతి కొద్ది కాలంలోనే దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న విజయ దేవరకొండ తోడయ్యారు. అభిమానుల, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన చిత్రాన్ని అందిస్తామని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది.

ఈ చిత్రంలో విజయ్ సరసన నాయికగా శ్రీలీల నటిస్తున్నారు. తన అందం, అభినయం, నాట్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ యువ తార మొదటిసారి విజయ్ తో జోడీ కడుతుండటం విశేషం. ఇక 'జెర్సీ'లో తన సంగీతంతో కట్టిపడేసిన అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. 'జెర్సీ'తో జాతీయ అవార్డును అందుకున్న నవీన్ నూలి ఎడిటర్ గా పని చేయనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా గిరీష్ గంగాధరన్, ఆర్ట్ డైరెక్టర్ గా అవినాష్ కొల్లా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కానుందని యూనిట్‌ పేర్కొంది. 

ఇదిలా ఉంటే విజయ్‌ దేవరకొండ నటించబోతున్న మరో సినిమా అప్‌ డేట్‌ కూడా వచ్చింది. తనకు గీత గోవిందం` వంటి బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చి స్టార్‌ హీరోని చేసిన దర్శకుడు పరశురామ్‌తో విజయ్‌ మరో సినిమా చేస్తున్నారు. `వీడీ13` పేరుతో రూపొందే ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. విజయ్‌కి బర్త్ డే విషెస్‌ చెబుతూ టీమ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించబోతున్నామని పేర్కొంది. ఇది `గీత గోవిందం`కి సీక్వెల్‌లా ఉంటుందని సమాచారం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?