
మెగా పవర్ స్టార్ రాంచరణ్ వరుస చిత్రాలతో జోరు పెంచుతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ RRR రిలీజ్ కాకముందే మరో చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇండియా అగ్ర దర్శకుల్లో ఒకరైన శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ చిత్రం ఇటీవల ప్రారంభం అయింది.
ఇదిలా ఉండగా నేడు దసరా కానుకగా చరణ్ మరో క్రేజీ చిత్రాన్ని ప్రకటించాడు. జెర్సీ చిత్రంతో తన ప్రతిభ అందరికీ చాటిన Gowtam Tinnanuri దర్శకత్వంలో రాంచరణ్ మూవీ ఖరారైంది. చాలా కాలంగా వీరిద్దరి కాంబినేషన్ గురించి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నేడు దసరా పండుగ పురస్కరించుకుని ఈ ఆసక్తికర ప్రకటన చేశారు.
యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ ఇది' అంటూ Ram Charan ట్వీట్ చేశాడు. యువీ సంస్థ కూడా సోషల్ మీడియాలో అధికారికంగా ఈ చిత్రాన్ని ప్రకటించింది.
గౌతమ్ తిన్ననూరి గత రెండు చిత్రాలు క్లాస్ టచ్ ఉండే ఫిలిమ్స్. కానీ రాంచరణ్ మూవీ మాత్రం మాస్ ఎలిమెంట్స్ తో ఉండబోతోంది. దీనికోసం గౌతమ్ అద్భుతమైన స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: అఖిల్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ప్రీమియర్ షో టాక్
రాంచరణ్ అల్లూరి పాత్రలో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే శంకర్ చిత్రంపై కూడా చరణ్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాతే గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. బహుశా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో కావచ్చు. ఈ లోపు గౌతమ్ స్క్రిప్ట్ కి తుదిమెరుగులు దిద్దనున్నాడు.