రామ్‌చరణ్‌-శంకర్‌ సినిమా బిగ్‌ అప్‌డేట్‌.. అసలు కథ రివీల్‌ చేసిన కియారా

Published : Oct 15, 2021, 09:24 AM IST
రామ్‌చరణ్‌-శంకర్‌ సినిమా బిగ్‌ అప్‌డేట్‌.. అసలు కథ రివీల్‌ చేసిన కియారా

సారాంశం

ఈ సినిమా ఎలా ఉండబోతుంది? కథేంటి? అనేది ఆసక్తి నెలకొంది. రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కానీ దీనిపై ఇప్పుడు kiara advani క్లారిటీ ఇచ్చారు. rc15 సినిమా కథేంటో చెప్పేసింది. 

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో ఓ భారీ పాన్‌ ఇండియా చిత్రం రూపొందుతుంది. ఇటీవల ఇది గ్రాండ్‌గా స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. `rc15` వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. `భరత్‌ అనే నేను`, `వినయ విధేయ రామ` చిత్రం తర్వాత తెలుగులో కియారా నటిస్తున్న చిత్రమిది. భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. దిల్‌రాజ్‌ బ్యానర్‌లో రూపొందుతున్న 50వ చిత్రమిది. దీంతో దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారాయన. 

ఇదిలా ఉంటే ఈ సినిమా ఎలా ఉండబోతుంది? కథేంటి? అనేది ఆసక్తి నెలకొంది. రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కానీ దీనిపై ఇప్పుడు kiara advani క్లారిటీ ఇచ్చారు. rc15 సినిమా కథేంటో చెప్పేసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ram charan‌-shankarల కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇది సాలిడ్‌ కథతో వస్తుందట. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఉంటుందని తెలిపింది.శంకర్‌ మార్క్ సందేశం ఇందులో ఉంటుందట. అది ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని, సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్‌ గా ఉంటుందని తెలిపింది. 

also read: బ్లాక్‌ డ్రెస్‌లో క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్ తో గిలిగింతలు పెడుతున్న పూజా హెగ్డే.. బర్త్ డే ఫోటోలు..

ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభం కాగా, ఓ స్పెషల్‌ సాంగ్ ని చిత్రీకరిస్తున్నట్టు చెప్పింది కియారా. ఈ పాట కోసం భారీసెట్‌ని నిర్మించినట్టు వెల్లడించింది. ఇది మంచి సందేశాత్మక చిత్రం మాత్రమే కాదని,  విజువల్‌ వండర్‌లాగానూ ఉండబోతుందని తెలుస్తుంది. ఇందులో అంజలి, సునీల్‌, జయరాం, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌.ఎస్‌.థమన్‌ సంగీతం అందిస్తున్నారు. 

కియారా అద్వానీ ఇటీవల తన ప్రియుడు సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి నటించిన `షేర్షా` చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు `భూల్‌ భులయ్యా 2`, `జగ్‌ జుగ్‌ జీయో`, `మిస్టర్‌ లేలే` చిత్రాల్లో నటిస్తుంది. 

also read: స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ రెడ్‌ శారీలో పిచ్చెక్కిస్తున్న `జాతిరత్నాలు` చిట్టి.. ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరేమో!

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Ram Charan: రాంచరణ్- జాన్వీ కపూర్ నుంచి కార్తీక్ - శ్రీలీల వరకు.. 2026లో రాబోయే క్రేజీ జంటలు
Hero Karthik: ఆ అలవాటు వల్ల కెరీర్ లో పతనం.. అన్వేషణ హీరో కార్తీక్ ఆరోగ్యం ఆరోగ్య పరిస్థితి ఏంటి ?