ఎన్టీఆర్ సినిమాను ప్రారంభించనున్న పవన్ కళ్యాణ్

Published : Oct 22, 2017, 02:07 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
ఎన్టీఆర్ సినిమాను ప్రారంభించనున్న పవన్ కళ్యాణ్

సారాంశం

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తదుపరి చిత్రం ఎన్టీఆర్ 28 సినిమా ప్రారంభించనున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి మూవీ తీస్తున్న త్రివిక్రమ్

జూనియర్ ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా రాబోతోందనే విషయం విదితమే. అయితే తాజా న్యూస్ ఎంటంటే ఈ సినిమాను సోమవారం లాంచ్ చేయనున్నారు. జై లవ కుశ మూవీ మంచి హిట్ కొట్టడంతో జోష్ మీదున్నారు ఎన్టీఆర్. త్రివిక్రమ్‌తో ఆయన మొదటి సినిమా కావడంతో ప్రేక్షకుల్లో కూడా ఈ కాంబినేషన్‌పై భారీగా అంచనాలున్నాయి. 2018 జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం పవన్‌తో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంటనే ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ సినిమా ప్రారంభమవుతుంది.

సోమవారం (అక్టోబర్ 23) ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించి వచ్చే ఏడాది జనవరి నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ నిర్వహించనున్నారు. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాబోతుండడం విశేషం. తొలి క్లాప్ కూడా ఆయనే కొట్టనున్నారు. పవన్ కల్యాణ్‌తో పాటు కల్యాణ్ రామ్, హరికృష్ణలు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ స్వరకర్తగా వ్యవహరించనున్నారు. ఇది ఎన్టీఆర్‌కు 28వ సినిమా. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తుండటంతో సినిమా ప్రారంభానికి ముందే అంచనాలు ఏర్పడుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌