ఎస్వీరంగారావుగా మోహన్ బాబు. మహానటిలో క్రిష్, తరుణ్ భాస్కర్

First Published Oct 22, 2017, 1:42 PM IST
Highlights
  • అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మహానటి
  • మహానటి చిత్రంలో ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు
  • కెవి రెడ్డిగా క్రిష్, సింగితం శ్రీనివాస రావుగా తరుణ్ భాస్కర్

తెలుగు చలనచిత్ర పరిశ్రమకే వన్నె తెచ్చిన మహనీయుల్లో యస్వీ రంగారావు ఒకరు. ఎస్వీఆర్ అంటే భారతీయ చలన చిత్ర చరిత్రలో ఓ అధ్యాయం. ఎలాంటి పాత్రలోనైనా సునాయాసంగా దూరిపోగల నటుడు. ఇక మహానటి సావిత్రితో ఆయనకున్న అనుబంధం ప్రత్యేకమైనది. సావిత్రిని కూతురులా చూసేవారు. మాయా బాజార్ లో "ఒకరి పాత్రలో ఒకరు ప్రవేశించి ప్రేక్షకులకు ఎవరు సావిత్రి ఎవరు ఎస్విఆర్" అనే రేంజిలో సినిమాలో అనుమానం కలిగించటం వారికే చెల్లింది.

 

సావిత్రి సినీ జీవితం లోనే ప్రత్యేకత సంతరించుకున్న చిత్ర రాజం "మాయాబజార్" కు  సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయం లోనే సింగీతం శ్రీనివాసరావుగారూ వచ్చారట. ఈ సన్నివేశాల్లో సింగీతం పాత్ర కూడా ఉండటం విశేషం. మాయాబజార్ దర్శకుడు కదిరి వెంకట రెడ్డి (కె.వి.రెడ్డి) సహాయకుడుగా సింగీతం పాత్రను యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ పోషిస్తున్నాడట. కె.వి.రెడ్డి పాత్రను డైరెక్టర్ క్రిష్ చేస్తున్నాడు.

"మాయాబజార్" కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా సింగీతం భావోద్వేగానికి గురయ్యారట. అప్పటి జ్నాపకాల్ని ఆయన సెట్ లోని వారితో పంచుకున్నారట. చిత్ర బృందాన్ని ఉద్దేశించి ఆయన చిన్న పాటి ప్రసంగం కూడా చేస్తూ తన జ్నాపకాల్ని పంచుకున్నారట.

ఒకప్రముఖ స్టూడియోలో మంచు "మోహన్‌బాబు" ఘటోత్కచుడి గెటప్‌లో కనిపించారట! పక్కనే కీర్తీ సురేశ్‌ శశిరేఖ గెటప్‌ ఉన్నారట! అదంతా అక్కడ జరిగే మహానటి సినిమాలో "మాయాబజార్‌" షూటింగ్‌ సందడి మరి! దర్శకుడు కేవీ రెడ్డి గెటప్‌లో క్రిష్‌, కేవీ రెడ్డి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సింగీతం శ్రీనివాసరావు గెటప్‌లో తరుణ్‌ భాస్కర్‌ కనిపించారట. "మాయాబజార్‌" మళ్లీ తీస్తున్నారా అన్నత ఉద్వేగం ఆ వాతావరణం లో మిళితమై ఉందట! కట్‌ చేస్తే, ఈ కంప్లీట్‌ సీన్‌ని మరొకరు డైరెక్ట్‌ చేస్తున్నారు. అతనే... నాగ అశ్విన్‌. "మహానటి" లో సావిత్రి పాత్రను యువ నటి "కీర్తి సురేష్" చేస్తోంది.

 

మహానటి సావిత్రి జీవితకథతో ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్‌ నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ సమర్పణలో స్వప్న సినిమాస్‌ నిర్మిస్తున్న సినిమా "మహానటి" సావిత్రి నట జీవితంలో మధురమైన చిత్రం గా నిలిచిన "మాయాబజార్‌" లోని కొన్ని దృశ్యాలను "మహానటి" కోసం తీస్తున్నారు. ఈ దృశ్యాలకోసం ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి పర్యవేక్షణలో "మాయాబజార్‌" సెట్‌ వేశారు అవినాష్‌. ప్రస్తుతం ఆ సెట్‌లో కీలక సన్నివేశాలు తీస్తున్నారు.

 

 

ఇది తెలుసుకున్న సింగీతం సెట్‌ కి వెళ్లారు. కేవీ రెడ్డి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. "మహానటి" లో సావిత్రిగా కీర్తీ సురేశ్, ఎస్వీ రంగారావుగా మోహన్‌బాబు నటిస్తున్న సంగతి తెలిసిందే. సింగీతంగా "పెళ్లి చూపులు" దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ నటిస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

 

"యమదొంగ, యమలీల–2" సినిమల్లో యమధర్మరాజు గా నటించిన "లెజెండ్ మోహన్‌బాబు" ఈ పౌరాణిక పాత్రలో నటించి మెప్పించారు. "మహానటి"లో ఘటోత్కచుడిగా ఎస్విఆర్ ను మరిపించకపోయినా గుర్తుంచుకునేలా మోహన్ బాబు తప్ప మెప్పించగల నటులు ఇంకెవ్వరూ లేరని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో?  విఖ్యాత  నిర్మాత చలసాని అశ్వినిదత్ కుమార్తెలు ప్రియాంక, స్వప్నల నిర్మాణ పర్యవేక్షణలో అల్లుడు ప్రియాంక భర్త "నాగ్ అశ్విన్" దర్శకత్వం లో ఈ చిత్రాన్ని రూపొందిస్తు న్నాడు. దీన్ని మరో క్లాసిక్ గా తీర్చిదిద్దడానికి చిత్ర బృందం శతవిధాలా ప్రయత్నిస్తోంది.

click me!