Vakeel Saab Director: వకీల్ సాబ్ డైరెక్టర్ ని సర్ ప్రైజ్ చేసిన పవన్ కళ్యాణ్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 24, 2021, 05:01 PM IST
Vakeel Saab Director: వకీల్ సాబ్ డైరెక్టర్ ని సర్ ప్రైజ్ చేసిన పవన్ కళ్యాణ్

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలై ఘనవిజయం సొంతం చేసుకుంది. పింక్ రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం పవన్ అభిమానులకు ఫుల్ ట్రీట్ అందించింది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలై ఘనవిజయం సొంతం చేసుకుంది. పింక్ రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం పవన్ అభిమానులకు ఫుల్ ట్రీట్ అందించింది. పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం ఇది. పింక్ చిత్రానికి కొంచెం కమర్షియల్ అంశాలు జోడించి అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు వేణు శ్రీరామ్. 

పింక్ లాంటి చిత్రాల్లో పవన్ ఫ్యాన్స్ కోరుకునే అంశాలు పెట్టడం అంత సులువు కాదు. కానీ వేణు శ్రీరామ్ కథని బలంగా చెబుతూనే పవన్ ని స్టైలిష్ గా ప్రజెంట్ చేశారు. దీనితో వేణు శ్రీరామ్ పవన్ ఫ్యాన్స్ కి అభిమాన దర్శకుడిగా మారిపోయాడు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమలో తనతో సన్నిహితంగా ఉన్న వారందరికీ మామిడి పండ్లు లేదా మరేదైనా గిఫ్ట్స్ పంపుతూ ఉంటారు. 

తాజాగా పవన్ కళ్యాణ్ దర్శకుడు వేణు శ్రీరామ్ ని సర్ ప్రైజ్ చేశాడు. వేణు శ్రీరామ్ కి పవన్ క్రిస్టమస్ సందర్భంగా కొన్ని గిఫ్ట్స్ పంపించాడు. పవన్ పంపిన గిఫ్ట్స్ ని వేణు శ్రీరామ్ సతీమణి గాయత్రీ శ్రీరామ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ' మన వకీల్ సాబ్ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఈ గిఫ్ట్స్.. చాలా అందమైన గిఫ్ట్స్ పంపినందుకు ధన్యవాదాలు సర్' అని గాయత్రీ శ్రీరామ్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టింది. 

వేణు శ్రీరామ్.. ఓ మై ఫ్రెండ్ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత నానితో ఎంసీఏ చిత్రం తెరకెక్కించి తొలి విజయం అందుకున్నాడు. ఆతర్వాత పవన్ తో వకీల్ సాబ్ తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా వేణు శ్రీరామ్ తదుపరి చిత్రంపై ఇంకా క్లారిటీ రాలేదు. బన్నీతో ఐకాన్ అనే చిత్రం తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ చిత్రం చాలా కాలంగా పట్టాలెక్కడం లేదు. 

Also Read: Aparna Balamurali: 'ఆకాశం నీ హద్దురా' హీరోయిన్ ఆరోగ్యంపై వదంతులు.. ఒక్కసారిగా అందరికి మైండ్ బ్లాక్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్
Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే