Kiara Advani : బిగ్ అనౌన్స్ మెంట్ ఇవ్వబోతున్న కియార అద్వాని..పెళ్లి చేసుకోబోతోందా..?

Published : Dec 24, 2021, 04:31 PM ISTUpdated : Dec 24, 2021, 04:36 PM IST
Kiara Advani : బిగ్ అనౌన్స్ మెంట్ ఇవ్వబోతున్న కియార అద్వాని..పెళ్లి చేసుకోబోతోందా..?

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియరా అద్వాని న్యూ ఇయర్ సందర్భంగా బిగ్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ పెళ్ళి చేసుకోబోతుందంటున్నారు బాలీవుడ్ జనాలు.

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని(Kiara Aadvani) దూసుకుపోతోంది. వరుస సినిమాల సక్సెస్ లో ఉంది కియారా. ఇటు టాలీవుడ్ లో కూడా రెండు సినిమాలు చేసిన కియారా ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ  బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. ఇటు సౌత్ .. అటు నార్త్ .. మరో వైపు వెబ్ సిరీస్ లు ఇలా అన్నింట సక్సెస్ చిరునామాగా పరుగులు పెడుతుంది కియారా.

గత కొంత కాలంగా కియార(Kiara Aadvani) బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సిద్థార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra)తో ప్రేమలో ఉందంటూ టాక్ గట్టిగా వినిపిస్తుంది. దీని గురించి వారు స్వయంగా స్పందించకపోయినా. ఇద్దరు చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతూ.. ఇండైరెక్ట్ గా అందరికి హింట్ కూడా ఇచ్చారు. వీళ్ల లవ్ మ్యాటర్ సీక్రేట్ గా ఉంచినా.. రోడ్డుమీద చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం ,ఇద్దరు కలిసి వెకేషన్స్ కు వెళ్తూ.. కెమెరా కంటికి చాలాసార్లు దోరికారు. దాంతో వీరి మధ్య నిజంగానే లవ్ ట్రాక్ నడుస్తుందంటూ బాలీవుడ్ ఫిక్స్ అయ్యింది.

అంతే కాదు ఆ మధ్య చాలా సార్లు సిద్థార్ధ్(Sidharth Malhotra) ఇంటికి కియార(Kiara Aadvani) వెళ్తుండటం.. సెల్పీలు... పార్టీలంటూ ఇద్దరూ జంటగా తిరుగుతుండటంతో అందరకి ఉన్న అనుమానం బలపడింది. అందరికి తెలిసిపోయింది.. ఇక దాచిపెట్టడం ఎందకు అనుకున్నారో ఏమో.. తమ రిలేషన్ షిప్ గురించి అందరికి తెలిసేలా అనౌన్స్ మెంట్ చేయాలని ఆలోచిస్తున్నారట జంట. లేకుంటే ఇలాగే రకరకాలా వార్తలతో.. ఉన్నవి లేనివి క్రియేట్ చేసి..సోషల్ మీడియాలో అనవసరంగా గోల చేసే అవకాశం ఉండటంతో. తామే బయట పడితే మంచి అనుకుంటున్నట్టు టాక్.

పైగా మొన్నటి వరకూ సీక్రేట్ లవ్  మెయింటేన్ చేసిన కత్రీనా,విక్కీలు రీసెంట్ గా ఒకటయ్యారు. వారి విషయంలో కూడా మొదటి నుంచి బాలీవుడ్ జనాలకు అనుమానమే ఉంది. ఇక కియారా జంట కూడా న్యూ ఇయర్ కు సోషల్ మీడియాలో లవ్ మ్యాటర్ అనౌన్స్ చేసి.. ఆతరువాత పెళ్ళి గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నారట. మరి న్యూ ఇయర్  కు నిజంగానే  ఈ బాలీవుడ్ జంట అనౌస్స్ చేస్తారా..? లేదా అనేది చూడాలి. అయితే వీరిద్దరు మొదటగా షేర్ష మూవీలో కలిసి నటించారు. ఆ సినిమా టైమ్ లోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది.   

Also Read :  Trivikram Movie Update: ప్రొడ్యూసర్ అవతారం ఎత్తిన త్రివిక్రమ్.. లిస్ట్ లో ఉన్న స్టార్ హీరోలెవరంటే...?

ఇప్పటికే బాలీవుడ్ లో చాలా ప్రేమ పక్షులు కలిసి ఒకటైయ్యారు. రీసెంట్ గా విక్కీ-కత్రీనా, అంతకు ముందు రణ్ వీర్ సింగ్- దీపిక, ప్రియాంక-నిక్, ఇలా ఈ తరం నుంచి పాత తరం బాలీవుడ్ హీరోలు... హీరోయిన్లు  కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంకొంత మంది బాలీవుడ్ యంగ్ స్టార్స్  జంటలు పెళ్లికి సై అంటున్నారు. మరి కియారా -మల్హోత్రాల(Sidharth Malhotra) ముహూర్తం ఎప్పుడు కుదురుతుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు
Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే