ఉమెన్స్ డే స్పెషల్‌ గిఫ్ట్.. పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌సాబ్‌` కొత్త పోస్టర్‌

Published : Mar 08, 2021, 11:19 AM IST
ఉమెన్స్ డే స్పెషల్‌ గిఫ్ట్.. పవన్‌ కళ్యాణ్‌ `వకీల్‌సాబ్‌` కొత్త పోస్టర్‌

సారాంశం

పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `వకీల్‌సాబ్‌` నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ట్రీట్‌ వచ్చింది. మహిళలకు కొత్త పోస్టర్‌తో విషెస్‌ చెప్పారు పవన్‌ అండ్‌ `వకీల్‌ సాబ్‌` టీమ్‌. ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్న ముగ్గురు అమ్మాయిలను పరిచయం చేశారు. 

పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `వకీల్‌సాబ్‌` నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ట్రీట్‌ వచ్చింది. మహిళలకు కొత్త పోస్టర్‌తో విషెస్‌ చెప్పారు పవన్‌ అండ్‌ `వకీల్‌ సాబ్‌` టీమ్‌. ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్న ముగ్గురు అమ్మాయిలను పరిచయం చేశారు. నివేదా థామస్‌, అంజలి, అనన్య నాగళ్ల లుక్‌లను విడుదల చేశారు. వీరి ముదు చైర్‌లో పవన్‌ కళ్యాణ్‌ ఓ చేతిలో కర్ర, మరో చేతిలో బుక్‌ పట్టుకుని కూర్చొని ఉన్న పోస్టర్‌ ఆకట్టుకుంటుంది. ఆసక్తిని రేకెత్తిస్తుంది.

వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో హిందీ `పింక్‌`కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. బోనీ కపూర్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 9న విడుదల చేయనున్నారు. ఇటీవల విడుదల చేసిన `సత్యమేవ జయతే` పాట విశేషంగా ఆకట్టుకుంటోంది. యూట్యూబ్‌ లో మిలియన్స్ వ్యూస్‌ని రాబట్టుకుంటోంది. పవన్‌ కళ్యాణ్‌ రెండేళ్ల గ్యాప్‌ తో రీఎంట్రీ ఇస్తూ నటిస్తున్న చిత్రమిది కావడం విశేషం. దీంతో సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఇదిలా ఉంటే మహాశివరాత్రి సందర్భంగా మరో గిఫ్ట్ ఇవ్వబోతున్నారు పవన్‌. ఆయన క్రిష్‌ దర్శకత్వంలోనటిస్తున్న `పీఎస్‌పీకే27`(వర్కింగ్‌ టైటిల్‌) చిత్ర ఫస్ట్ లుక్‌, టైటిల్‌, మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేయబోతున్నారు. ఫస్ట్ గ్లింప్స్ కూడా ఇవ్వబోతుంది యూనిట్‌. దీనికి `హరిహర వీరమల్లు` అనే టైటిల్‌ని అనుకుంటున్నట్టు టాక్‌.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Balakrishna vs Rajasekhar: ప్రేమికులరోజు స్పెషల్‌గా రాజశేఖర్‌తో పోటీ పడి అడ్రస్‌ లేకుండాపోయిన బాలకృష్ణ సినిమా ఇదే
OTT: ఓటీటీలోకి క్రేజీ హీరో జీవా సూపర్ హిట్ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?